ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల హడావిడే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబరు 26: కేరళ రాష్ట్రం శబరిమలలో ఆదివారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో గాయపడినవారి వివరాలు అందక అయ్యప్ప భక్తులు, వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కాగా ఆదివారం నాటి ఘటనలో గాయపడిన అనంతపురం నగరం లక్ష్మీనగర్‌కు డి.రాజు కుమారుడు అఖిల్‌కుమార్(24)ను సోమవారం రాత్రి ఇక్కడికి తీసుకువచ్చారు. శబరిమల నుంచి నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తాము నలుగురు మిత్రులం కలిసి కారులో శబరిమల వెళ్లామని అఖిల్‌కుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం 6.45 ప్రాంతంలో భక్తులను వదలడంతో ఒక్కసారిగా తోపులాట జరిగిందన్నారు. విఐపిలు వస్తున్నారని పోలీసులు చెదరగొట్టడం తోపులాటకు దారితీసిందన్నారు. తొక్కిసిలాటలో తన కుడి కన్నుకు గాయమైందన్నారు. రక్తం గడ్డ కట్టడంతో చూపు కనిపించడం లేదని, కింద పడటంతో తలకు కూడా గాయాలయ్యాయన్నారు. ఆసుపత్రిలో అఖిల్‌కు ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి మల్లేష్ అనే వ్యక్తితో పాటు 8 మందితో కూడిన అయ్యప్పమాలధారుల బృందం శబరిమల వెళ్లింది. వారి ఫోన్ పనిచేయక పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా అనంతపురం నుంచి ఒకే బృందంగా 25 నుంచి 30 మంది దాకా వెళ్లారని, వారికి సంబంధించిన వారే తొక్కిసలాటలో గాయపడ్డారన్న ప్రచారం సాగుతోంది. కానీ వారు ఎవరైందీ వివరాలు అందలేదు. అయితే తొక్కిసలాట సరిగిన సమయంలో స్వల్పంగా గాయపడిన వారు శబరిగిరిలోని ఆస్పత్రి, పంపాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యకేంద్రం, అందుబాటులో ఉన్న ప్రైవేటు క్లినిక్‌లలో ప్రథమి చికిత్స చేయించుకుని తిరుగు ప్రయాణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

చిత్రం..శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన అఖిల్