ఆంధ్రప్రదేశ్‌

శ్రీ చిన జీయర్‌స్వామికి అమెరికాలో అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), డిసెంబర్ 29: భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది సందర్భంగా అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌లో శ్రీ త్రిదండి రామానుజ చిన జియర్ స్వామీజీకి అరుదైన గౌరవం లభించింది. స్వామీజీ బ్లూమింగ్‌టన్ నగరం పర్యటనకు వచ్చిన సందర్భంగా నగర మేయర్ తరి రెనె్నర్ రామానుజ సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నిర్మాణం అవుతున్న 216 అడుగుల ‘స్టాట్యూ అఫ్ ఈక్వాలిటీ’ని పురస్కరించుకుని నగర మేయర్ 28న ‘డే అఫ్ ఈక్వాలిటీ’ (సమతా దినోత్సవం)గా ప్రకటన చేస్తూ తత్సంబంధమైన అధికారిక ప్రకటనా పత్రాన్ని నగర మేయర్ తరి రెనె్నర్ శ్రీ త్రిదండి రామానుజ చిన జియర్ స్వామిజీ వారికి అందజేశారు. శ్రీ రామానుజాచార్యుల వారికి బ్లూమింగ్‌టన్ నగర ప్రజలు అందించిన అరుదైన గౌరవానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జియర్ స్వామిజి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకులు, ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత ‘మాస్ట్రో’ డా గజల్ శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు మండవ వెంకటేశ్వరరావు, హిందూ స్వయం సేవక్ సంఘ కన్వీనర్ మురళి పాల్గొన్నారు.

చిత్రం..చిన జీయర్ స్వామిని సత్కరిస్తున్న బ్లూమింగ్‌టన్ మేయర్