రాష్ట్రీయం

సంక్షేమ బాటలో నడుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారానికి తెచ్చి నూరేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఓడించిన మహానాయకుడని అన్నారు. ఎన్టీ రామారావు తెలుగుతేజాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారని, తెలుగువారికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా భావించిన ఎన్టీఆర్ ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఆశయంతో రూ.2కే కిలో బియ్యం పథకాన్ని అమలు చేశారన్నారు. దేశంలో తొలిసారిగా పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలో జనతా పార్టీ ప్రయోగం తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో ఎన్టీఆర్ కృషి సదా స్మరణీయమని ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదరు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎంపి సిఎం రమేష్, తెలుగుదేశం యూరోప్ విభాగం అధ్యక్షుడు జయకుమార్ గుంటుపల్లి తదితరులు పాల్గొన్నారు.