ఆంధ్రప్రదేశ్‌

23 నుంచి బడ్జెట్‌పై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. వివిధ శాఖల మంత్రులు, విభాగాధిపతులతో ఈ నెల 23 నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల మూడు రోజుల పాటు వరుసగా సమావేశం సమావేశం కానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.34 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపొందించారు. అయితే అదనంగా మరో 20 వేల కోట్ల రూపాయల మేరకు కేటాయింపులు కావాలని వివిధ శాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. ద్రవ్య లోటు 20 వేల కోట్ల రూపాయలకు, రెవెన్యూ లోటు 14 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. రెవెన్యూ లోటు 20 వేల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి దాదాపు 17 వేల కోట్ల రూపాయల మేరకు కేటాయింపులు రావాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఖజనాకు దాదాపు 1000 కోట్ల రూపాయల మేరకు గండి పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టేక్కించేందుకు చేపట్టాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులు, మంత్రులతో సమావేశం కానున్నారు. ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి సారించనున్నారు. జిఎస్‌టిలో ప్రాదేశిక జలాల్లో జరిగే లావాదేవీలపై పన్ను వసూలు రాష్ట్రానికే దఖలు పడటంతో 600 కోట్ల రూపాయల మేర ఆదాయం కొనసాగనుంది. యువతకు, క్రీడలకు వచ్చే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నిరుద్యోగ భృతి చెల్లించేందుకు గతంలో సిఎం హామీ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి స్పష్టత లభించనుంది. 23న వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య, సంక్షేమం, కార్మిక, ఉపాధి, హోం శాఖల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించనున్నారు. 24న పంచాయతీరాజ్, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, మున్సిపల్, పట్టణాభివృద్ధి, జలవనరులు, ఐటి శాఖపై సమీక్షిస్తారు.
25న పౌరసరఫరాలు, వైద్యం, విద్య, పర్యావరణం, అటవీ, సైన్సు, రెవెన్యూ, స్టాంప్స్, దేవాదాయ, పరిశ్రమల శాఖపై సమీక్ష చేస్తారు. ఈమేరకు అధికారులకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడి సచివాలయంలో ఈనెల 25న మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. విశాఖలోని భాగస్వామ్య సదస్సు, బడ్జెట్ రూపకల్పన, దావోస్ పర్యటన తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఆ రోజు మధ్యాహ్నం 11.30 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అవుతుంది.
సిఎం హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన
వెలగపూడిలోని సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోకలు సాగించేందుకు వీలుగా హెలిపాడ్ ఏర్పాటుకు స్థలాన్ని గురువారం పరిశీలించారు. సచివాలయం సమీపంలోని బ్లాక్-1 వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవడంతో నేలపాడు వద్ద ఒకటి ఏర్పాటు చేశారు. అది దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు డిఐజి (ఇంటిలిజెన్సు) సత్యనారాయణ నేతృత్వంలో అధికారులు వివిధ ప్రాంతాలను పరిశీలించారు. సచివాలయానికి దగ్గర్లోనే ఉండేలా అధికారులు ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలాలను పరిశీలించారు. ఎల్ అండ్ టి కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే అక్కడ విద్యుత్ టవర్లు ఉండటంతో మందడం, గేట్-2 పరిసరాల్లో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ పర్యటనలో సిఆర్‌డిఎ అధికారులు, సిపి గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.