ఆంధ్రప్రదేశ్‌

హైందవ సంస్కృతిని కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, జనవరి 19: ప్రపంచంలోనే హైందవ సంస్కృతి చాలా గొప్పదని అటువంటి సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కంచికామకోటి పీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి వివరించారు. గురువారం శ్రీకాళహస్తి ముక్కంటీశుని దేవస్థానం గాలిగోపురం పునర్నిర్మాణం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ జరిగిన అతిరుద్ర యాగంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక సభకు టిటిడి మాజీ ఇ ఓ పి.వి.ఆర్.కె.ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని చాలా దేశాల్లో హిందూ ఆలయాలు ఉన్నాయని అయితే కొన్ని మాత్రమే ప్రస్తుతం వెలుగులో ఉన్నాయని చెప్పారు. 1400 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లో వినాయకుడి గుడిని నిర్మించారని, కంబోడియ దేశంలో 1200 ఏళ్ల క్రితం మహావిష్ణువు ఆలయాన్ని నిర్మించారని ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూదేవాలయంగా మారిందని చెప్పారు. భారత దేశంలో రాజరాజచోళుడు భారీ సంఖ్యలో ఆలయాలను, గోపురాలను నిర్మించారని ఆ తరువాత 500 సంవత్సరాలు క్రితం శ్రీ కృష్ణదేవరాయులు ఆలయాలను గోపురాలను నిర్మించారన్నారు. ఆయన నిర్మించిన గోపురం శ్రీకాళహస్తిలో ఆరేళ్ళ క్రితం కూలిపోతే నవయుగ సంస్థ వారు తిరిగి నిర్మించారని ఇటు వంటి వారిని అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. శిఖరం జ్ఞానాన్ని సూచిస్తుందని, ఆలయానికి వెళ్లకపోయినా శిఖరాన్ని చూసి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుందన్నారు.
అడవిలో పుట్టిన తిన్నడు కన్నప్పగా మారాడని అటువంటి మహావ్యక్తుల చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1966లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలుసుకున్న కంచిపరమాచార్యులు చాతుర్మాస దీక్ష చేశారని గ్రీసు దేశం రాణి ఇక్కడకు వచ్చి పరమాచార్యుల ఆశీర్వాదం తీసుకున్నారని తెలిపారు. అందరూ పుణ్యకార్యాలు చేయాలని వ్యాసుడు కోరిన భారతాన్ని నిర్మించడానికి తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. మానవ విలువలు ఆలయ సంస్కృతి గురించి తెలుసుకోవాలని, ప్రతిమనిషి 32 ధర్మాలు పాటించాలన్నారు. అయితే మనుష్యుల్లో స్వార్థం పెరిగిందని సంసార ధర్మాన్ని పాటిస్తూనే పుణ్యకార్యాలు చేయాలని, సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సభలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, నవయుగ నిర్మాణ సంస్థ చైర్మన్ విశే్వశ్వరరావు, సహస్రావధాని మాడుగుల నాగపణిశర్మ తదితరులు పాల్గొన్నారు.