ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో ఫారెస్టు అకాడమీ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఫారెస్టు అకాడమీ శాఖను తిరుపతిలో ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకతిక శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశించారు. వెలగపపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ సిబ్బందికి శిక్షణ వంటివి నిర్వహించేందుకు ఈ కేంద్రం ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. పర్యావరణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ప్రభుత్వ విభాగాలకు కేటాయించే పని వేగవంతం చేయాలన్నారు. నవ్యాంధ్రలో ప్లానిటోరియం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ శాఖల ముఖ్య కార్యదర్శి అనంతరాము తదితరులు పాల్గొన్నారు.