ఆంధ్రప్రదేశ్‌

వచ్చే 19న ఎపి ఎన్‌జివో సంఘం ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఎపి ఎన్‌జివో అసోసియేషన్) రాష్ట్ర సంఘానికి ఫిబ్రవరి 19వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారి కె.దాలినాయుడు శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి చెందిన అధ్యక్ష, సహాధ్యక్ష పదవులతో పాటు 8 ఉపాధ్యక్ష పదవులకు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి, 5గురు కార్యదర్శులు, ఒక మహిళా కార్యదర్శి, ఒక ప్రచార కార్యదర్శి, ఒక కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ 3 గంటలకు ఓటర్ల జాబితా ఆమోదించడం జరుగుతుందని, 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని అనంతరం స్వీకరించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించి నామినేషన్లను పరిశీలించడం జరుగుతుందన్నారు.
అదేరోజు 4 గంటలకు అర్హత కలిగిన నామినేషన్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. 13వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించడం జరిగిందని, అనంతరం 3 గంటలకు తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్‌జివో హోంనందు ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఎన్నికల అనంతరం అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందన్నారు.
అధ్యక్ష పదవి కాలపరిమితి మూడేళ్లు అయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు అశోక్‌బాబు మరో 18 మాసాల్లో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆ తర్వాత మరొకరిని కోఆప్షన్ చేసుకుంటారు.