ఆంధ్రప్రదేశ్‌

పునః ప్రారంభంపై శ్రద్ధ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకై భారీగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్షణం తీరిక లేకుండా దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. అయితే ఆయన వ్యవహారశైలి ఎలా ఉందంటే ఏనుగులు పోయే దారి వదిలి... చీమలు వెళ్లే దారి కోసం వెతుకుతున్నట్లుగా వుంది.. ప్రధానంగా నెల్లూరు జి ల్లా కోవూరులో మూతబడ్డ సహకార పంచదార మి ల్లును పునఃప్రారంభించి దానిపై ఆధారపడ్డ 12వేల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు సుస్పష్టంగా కన్పిస్తున్నప్పటికీ కారణం ఏదైనా బాబు అటువైపు కనె్నత్తి చూడటం లేదు. ఈ మిల్లులో రెండువేల మంది ఉద్యోగులు, రెండువేల మంది ఎన్‌ఎంఆర్‌లు, మరో రెండువేల మంది సీజనల్ ఉద్యోగులు మొ త్తంపై 12వేల మంది ఆధారపడి వున్నారు. సమీపంలోని ప్రైవేట్ రంగంలోని ఎంపి షుగర్స్, గాయత్రి షుగర్స్ మిల్లులతో లాలూచీ పడటం వలనే ప్ర భుత్వం కోవూరు మిల్లు భవితవ్యాన్ని గాలికి వదిలేసిందనే విమర్శలు వినవస్తున్నాయి. వందమందికి కూడా ఉపాధి చూపని ఈ ఫ్యాక్టరీకి సమీపంలోని శ్రీ సిటీ సెజ్‌లో భూములను కేటాయించవచ్చు క దాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏడాది క్రితం విశాఖ పట్టణంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 12 రంగాల్లో 328 కంపెనీలు 4లక్షల 67వేల 577 కోట్ల రూపాయలు భారీగా పరిశ్రమలు స్థాపించుకోటానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయులు కుదుర్చుకుందంటూ పరిశ్రమశాఖ కమిషనర్ స్వయంగా లిఖితపూర్వకంగా తెలియజేసింది.
పైగా 9లక్షల 58 వేల 896 మందికి ఉపాధి లభించగలదన్నారు. తిరిగి ఇదే అధికారి కేవలం 14వేల 174 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే 33 కంపెనీలు ఎంవోయు కుదుర్చుకున్నాయని తెలియజేసారు. కొసమెరుపు... ఈ పెట్టుబడులు విషయం ఎలా వున్నప్పటికీ ఆ సదస్సులో కేవలం స్టార్ హోటళ్లలో వసతులు, అతిధి సత్కారాల కోసం రూ. 35కోట్ల 65 లక్షలు ఖర్చు చేయటం జరిగింది.