ఆంధ్రప్రదేశ్‌

ఏవోబిలో ఏరియల్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జనవరి 20: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒడిశా డిజిపి కెవి సింగ్, డిఐజి షైనీ విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. మల్కన్‌గిరి జిల్లా కుడుముల గుమ్మా బ్లాక్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఒడిశా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం జొడంబో, గాజుల మామిడి, పనస్పద, జంత్రి, రాళ్లగెడ్డ, కురమనూరు, పప్పులూరు, డోనాపుట్టు తదితర 21 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు బూత్‌లు ఏర్పాటు చేసారు.
అయితే మావోయిస్టులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని అనేకసార్లు గిరిజనులకు హెచ్చరికలు జారీచేస్తూ బ్యానర్లు వేలాడదీసారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒడిశాకు చెందిన ప్రభుత్వాధికారులు బూత్‌లను పరిశీలించేందుకు వెళ్లగా మావోయిస్టులు వారిని రహస్య ప్రాంతానికి అపహరించుకుపోయారు. అనంతరం వారిని సురక్షితంగానే విడిచిపెట్టారు. ఎన్నికలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎన్నికల్లో పాల్గొన్న వారికి తగిన మూల్యం తప్పదని హెచ్చరికలు జారీచేసి విడిచిపెట్టారు. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఒడిశా ప్రభుత్వం ఎలాగైనా ఈ ఎన్నికలు నిర్వహించాలని పకడ్భందీ చర్యలు తీసుకుంది. దీంతో శుక్రవారం మావోయిస్టు ప్రభావిత కటాఫ్ ఏరియాల్లో క్షుణ్ణంగా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ అనంతరం పప్పరమెట్టలో గిరిజనులతో సమావేశమయ్యారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని ఒడిశా డిజిపి కెవి సింగ్ తెలిపారు. మావోయిస్టులు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టినా వాటిని తిప్పికొట్టేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సినవసరం లేదని గిరిజనుల్లో మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఒడిస్సా మల్కన్‌గిరి జిల్లా ఎస్‌పి మిత్రాభాను మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.