ఆంధ్రప్రదేశ్‌

బిఎస్‌ఎన్‌ఎల్ మెడకు ఫైబర్ ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 20: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది ప్రభుత్వ రంగం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బిఎస్‌ఎన్‌ఎల్) పరిస్థితి. బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఫైబర్‌నెట్ సేవలు గుదిబండగా మారనున్నాయన్న చర్చ టెలికాం వర్గాల్లో మొదలైంది. ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలకు దీటుగా సేవలందించడంలో ఆటుపోట్లకు గురైన బిఎస్‌ఎన్‌ఎల్ సెల్ సేవలకు తాజాగా ఫైబర్‌నెట్ పథకంలో ఇచ్చే ల్యాండ్‌లైన్ కనెక్షన్లు కూడా చేరుతాయన్న ఆందోళన ప్రారంభమైంది. దేశంలో సెల్‌ఫోన్ సేవలు ప్రారంభమయ్యేంత వరకు రాజులా వెలిగిపోయిన బిఎస్‌ఎన్‌ఎల్ ఆ తరువాత క్రమేణా తన ప్రాభవాన్ని కోల్పోయి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత పదేళ్లలో సుమారు 80 శాతం ల్యాండ్‌లైన్ కనెక్షన్లను వినియోగదారులు తొలగించుకున్నారు. ప్రస్తుతం వ్యాపార సముదాయాలు, గృహాల్లో ఇంటర్నెట్ అవసరమున్న వారితో పాటు ప్రభుత్వశాఖల్లో ఉన్నతాధికారుల కార్యాలయాలు, గృహాలకు మాత్రమే బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో సామాన్యుడి ఇంట్లో కనిపించిన ల్యాండ్‌ఫోన్లు ఇపుడు కనుమరుగయ్యాయి. దీంతో ల్యాండ్ ఫోన్ కనెక్షన్లు ఎక్కడో తప్ప కనిపించని పరిస్థితి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌నెట్ పథకాన్ని ప్రవేశపెట్టి టివి, ఇంటర్నెట్‌తో పాటు ల్యాండ్ ఫోన్ కనెక్షను ఇస్తామని ప్రకటిండంతో పాటు ఆ పనులను వేగవంతం చేసింది. రానున్న ఏప్రిల్ మాసాంతానికి రాష్ట్రంలో 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని ఎపిఎస్‌ఎఫ్‌ఎల్ సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మేరకు అవసరమైన ప్రధాన కేబుల్‌ను రాష్ట్రంలో 23 వేల కిలోమీటర్లకు పైగా లాగారు. ఒక్కో జిల్లాలో సగటున 50 ప్రదేశాల్లో ఫైబర్‌నెట్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక అక్కడి స్థానిక కేబుల్ ఆపరేటర్ల కంట్రోల్ రూం వరకు కేబుల్ తీగలను లాగి సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వినియోగదారుల ఇళ్లకు ఫైబర్‌నెట్ పథకంలో భాగంగా టివి, ఇంటర్నెట్, ల్యాండ్‌ఫోన్ సేవలను అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.మొదట పట్టణ ప్రాంతాలతో పాటు ప్రధాన గ్రామాల్లో ఫైబర్‌నెట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తరువాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని వారంటున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ మాసాంతానికి 10 లక్షల కనెక్షన్లు, డిసెంబర్ మాసాంతానికి 50 లక్షల కనెక్షన్లు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు సేవలందించే ముందు సాంకేతికంగా ఒకటికి రెండు సార్లు పరీక్షలు, తనిఖీలు నిర్వహించి కనెక్షన్లు జారీ చేస్తామని వెల్లడిస్తున్నారు. ఇది పూర్తయతే ల్యాండ్‌లైన్ నుంచి ఇదే పథకంలో ఏ ఫోన్‌కు కాల్ చేసినా ఉచితమేనని అధికారులు వెల్లడించారు. ఇతర నెట్‌వర్క్‌లకు చేస్తే రాష్ట్రంలో అయితే నిమిషానికి 50 పైసలు, జాతీయ స్థాయి (ఎస్టీడి) అయితే ఒక రూపాయి కాల్ చార్జీలు ఉంటాయని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే బిఎస్‌ఎన్‌ఎల్ టారిఫ్ వర్తింపజేస్తామని వివరిస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇంటర్నెట్‌ను ఉపయోగించి స్కైప్‌లో ఏకంగా వీడియోకాల్‌లో మాట్లాడుకునే సదుపాయం ఉండటంతో ల్యాండ్ ఫోన్ వినియోగం ప్రజలకు ఎక్కువగా ఉండకపోవచ్చు.