ఆంధ్రప్రదేశ్‌

అరెస్టుకూ సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం విశాఖపట్నం ఆర్‌కె బీచ్‌లో జరి గే కొవ్వొత్తుల ర్యాలీలో తాను స్వయం గా పాల్గొంటున్నానని, పోలీసులు ఆంక్ష లు పెట్టినా వెనుకడుగు వేసేది లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. తనను అరెస్టు చేసినా చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాను కోరుతూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ తమ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. తనపై పెట్టిన కేసుల నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపిలు హోదాకోసం పోరాడతారని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే జూన్‌లో రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాను కల్పిస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు వైకాపా ఎంపీలు పదవులకు రాజీనామ చేసి ఉప ఎన్నికలకు వెళతామన్నారు. హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నిర్బంధ చర్యలు ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. బుధవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం అన్ని పక్షాలు కలిసి రావాలన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానిని కలవాలని, తాను కూడా ఈ అఖిలపక్షంతో వస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టనున్న ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చివరకు హోదా డిమాండ్‌ను కూడా తుంగలో తొక్కిన చంద్రబాబుపై టాడా కేసు పెట్టి జైల్లో పెట్టాలన్నారు. దావోస్‌కు ప్రత్యేక విమానాల్లో వెళ్లి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని, రాష్ట్రానికి ఈ పర్యటనల వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. విశాఖలో కూడా సిఐఐ సమావేశాల వల్ల ఏమీ ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబు మంచి ఈవెంట్ మేనేజర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీలోనే హోదాకు ఉన్న ప్రయోజనాలు ఉన్నాయని వెనకేసుకుని రావడం విడ్డూరంగా ఉందన్నారు. వందశాతం ఎక్సైజ్, ఆదాయం పన్ను రాయితీలు ప్రత్యేక ప్యాకేజీలో ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఏవరు ఉద్యమం చేసినా మద్దతు ఇస్తామన్నారు. ఇందులో రాజకీయాలకు తావులేదన్నారు. కేంద్రంలో మంత్రులు చేత రాజీనామా చేయించాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఇద్దరు నేతలు హోదా డిమాండ్‌ను నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు తన వైఖరిని మార్చుకుని కేంద్రంపై వత్తిడి తెచ్చి హోదాను సాధించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో టిడిపిని, చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారన్నారు. జల్లికట్టు కోసం తమిళనాడులో ప్రజలు ఏకమయ్యారన్నారు. ఇక్కడేమో సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం గోదావరి, కృష్ణా నదిపై ఎడాపెడా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.