ఆంధ్రప్రదేశ్‌

8 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 26: నవ్యాంధ్రలో విస్తృత పెట్టుబడుల సాధన లక్ష్యంగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరగనుంది. సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట గతేడాది విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు కొనసాగింపుగా వరుసగా రెండోసారి కూడా విశాఖ కేంద్రంగానే ఈ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గతేడాది అట్టహాసంగా నిర్వహించిన భాగసామ్య సదస్సులో సింగపూర్, మలేషియా, చైనా తదితర దేశాలతో పాటు దేశీంగా పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నాయి. పారిశ్రామిక వేత్తలతో దాదాపు 4.68 లక్షల కోట్లతో 328 పరిశ్రమలు స్థాపించేందుకు దేశ,విదేశీ పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే వీటిలో ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాన్న అంశాన్ని పక్కనపెడితే పారిశ్రామిక ప్రగతికి సంబందించి కీలక ప్రయత్నం మాత్రం జరిగిందనే చెప్పాలి. అయితే గత సదస్సుకు సంబంధించి చేసుకున్న ఒప్పందాల్లో 48 శాతం మేర పురోగతి సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే వాస్తవంలో మాత్రం ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే గతేడాది చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలను పక్కనపెడితే మరోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమే. ఈ సారి భాగస్వామ్య సదస్సులో రూ.8 లక్షల కోట్ల మేర పెట్టుబడులు నవ్యాంధ్రకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. దీనికోసం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా రాష్ట్రంలో 60వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఐఐసి) వీటిని పర్యవేక్షిస్తోంది. భాగస్వామ్య సదస్సులో కుదిరి ఒప్పందాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలను ముఖ్యమంత్రి తరచు సమీక్షిస్తూనే ఉన్నారు. పరిశ్రమలకు అనుమతులు, ఇతర అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు. ఇక తాజాగా విశాఖలో 27న ప్రారంభం కానున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాల నుంచి ప్రారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరితో పాటు 12 దేశాలకు చెందిన మంత్రులు భాగస్వామ్య సదస్సులో పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. దేశ,విదేశాల నుంచి దాదాపు 5000 మంది పారిశ్రామిక వేత్తలు సదస్సులో పాలుపంచుకుంటారు. సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, నిర్మలాసీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి తదితరులు పాల్గొంటారు.