ఆంధ్రప్రదేశ్‌

మహిళల సాధికారతపై అమరావతి డిక్లరేషన్: స్పీకర్ కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా తొలిసారిగా ఫిబ్రవరి 10-12 తేదీల్లో విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద జరుగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో సుదీర్ఘ చర్చలనంతరం మహిళా సాధికారతపై అమరావతి డిక్లరేషన్ చేయనున్నామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. భారీఎత్తున జరిగే ఈ సదస్సు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోఉన్న చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి స్ఫూర్తిదాయకం కావాలని కూడా తాను మనసా వాచా కోరుకుంటున్నాన్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి తీర్మానం చేయబోమని, ఈ సదస్సులో మహిళా ప్రతినిధులు వ్యక్తంచేసే అభిప్రాయాలను క్రోడీకరించి కేంద్రానికి తెలియజేయగలమన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిధి గృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ కోడెల ఈ సదస్సుకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. ఈ సదస్సు సందర్భంగా కనీసం ఐదువేల మందితో నగరంలో మహిళా సాధికారత పరుగును చేపట్టబోతున్నామన్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే దాదాపు 10వేల మంది అతిధులు, ప్రతినిధులందరికీ వారు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో అదిరిపోయేలా ఆతిధ్యం ఇవ్వాలనేది తన ఆకాంక్షగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోనూ, ప్రధానంగా ఇక్కడ జరిగే చర్చలు ఎప్పటికప్పుడు నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రత్యక్ష ప్రసారాలపై జాతీయ, స్థానిక ఛానెళ్ల ప్రతినిధులతో చర్చిస్తున్నామన్నారు.
29 రాష్ట్రాల స్పీకర్లతో తాను స్వయంగా మాట్లాడానని, అయితే బడ్జెట్ సమావేశాలు, ఎన్నికలు వంటి కారణాలతో కనీసం 15 మంది హాజరు కాగలరని చెప్పారు. బంగ్లాదేశ్, నేపాల్ నుంచి కూడా ప్రముఖులతో కూడిన బృందాలు రానున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, దలైలామా, రాష్ట్ర సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, మహారాష్టక్రు చెందిన అమృత ఫెడ్నస్, రాజకీయాలకతీతంగా ఎంపి కె.కవిత, డికె అరుణ, కిరణ్‌బేడి, నారా బ్రాహ్మణి, ప్రముఖ క్రీడాకారిణులు పివి సింధు, సానియామీర్జాలతో పాటు దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఉన్నతస్థాయి మహిళా అధికారిణులు హాజరు కానున్నారని తెలిపారు. ప్రముఖ గాయని లతామంగేష్కర్ తన సందేశాన్ని పంపిస్తున్నారని చెప్పారు. సినీ ధియేటర్లలో కూడా దీనిపై విస్తృత ప్రచారం కోసం చిన్న నిడివి గల లఘు చిత్రాలను రూపొందించామన్నారు. అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలనే సంకల్పంతో వైకాపా, టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ, బిజెపి, ఇతర అన్ని రాజకీయ పక్షాలకు లేఖలు రాయడమే గాక స్వయంగా ఫోన్ ద్వారా కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఈ సదస్సు కోసం 19 కమిటీలను ఏర్పాటు చేసామన్నారు. ఇందుకు పారిశ్రామిక, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రతిభావంతులైన వారిని భాగస్వామ్యం చేసి వారి అనుభవాలు, ఆలోచనలను చర్చల ద్వారా సమాలోచనం చేసి ఆపై అమరావతి డిక్లరేషన్‌ను రూపొందించడం జరుగుతుందన్నారు. తరగతి గదిలా కాకుండా ప్రతి ఒక్కరూ కనీసం రెండు నిమిషాలైనా తమ అభిప్రాయాలు వెల్లడించేలా చర్చాగోష్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా అతిధులు, ప్రతినిధులకు విడిది కోసం ఇప్పటికే అన్ని హోటళ్ల యజమానులతో చర్చించామన్నారు. వచ్చే ప్రతి ఒక్కరికి పుష్పం, కుంకుమబొట్టు, హారతితో సాంప్రదాయ స్వాగతం లభించనుందన్నారు.

చిత్రం.. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు