ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్యాకేజీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగుల, జర్నలిస్టుల ఆరోగ్య పథకం వైద్యసేవల ధరలపై ఇటు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ అటు ఆం.ప్ర. స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ‘ఆషా’ల మధ్య నేటికీ ప్రతిష్టంబన కొనసాగుతున్నది. ప్రస్తుతం అమల్లో వున్న వైద్యసేవల ధరలు ఏ మాత్రం సరిపోక గత రెండేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయంటూ ‘ఆషా’ ఆధ్వర్యంలో ఈనెల 15తేదీ నుంచి ఆరోగ్య పథకం సేవలు నిలిచిపోయిన విషయం విదితమే.
అయితే ఇప్పటికే పలుమార్లు జరిగిన చర్చలనంతరం డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఈ పథకం అమల్లో వున్న వైద్యసేవల ధరలపై 21.11 శాతం పెంచుతూ ఈనెల 23తేదీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే దీనిపై స్పందన తెలియజేయాలని కోరారు. అందుకు ‘ఆషా’ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ట్రస్ట్ కాస్తంత వెనక్కి తగ్గి ఈనెల 31 తేదీలోగా దీనికి అంగీకారం తెలిపిన ఆసుపత్రులకు మాత్రమే పెంచిన వైద్యసేవల ధరలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వర్తిస్తాయని కూడా ట్రస్ట్ సిఇవో రవిశంకర్ స్పష్టం చేసారు. ప్రస్తుతానికి ఉద్యోగులు ఏమైనా అత్యవసరం ఉంటే రీయింబర్స్‌మెంట్ పథకం కింద ప్రస్తుతం నగదు చెల్లించి చికిత్స చేయించుకుంటున్నారు. పైగా ప్రతి ఒక్కరూ కూడా ఆసుపత్రుల నిర్వాహకులు కోరుతున్నట్లు వైద్యసేవల ధరలు పెంచాలని కోరుతున్నారు. ఇదిలా వుండగా ఈ వివాదానికి తెర పడేందుకై ఆఖరి అవకాశంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 30 తేదీ విజయవాడలో నెట్‌వర్క్‌లోని అన్ని ఆసుపత్రుల నిర్వాహకులతో తొలిసారిగా విస్తృత సమావేశం జరుగబోతున్నది. ఈ వ్యవహారంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ సీరియస్‌గా వున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా వైద్యసేవల ధరలపై 21.11 శాతం పెంచటం జరిగిందని, దీంతో సంతృప్తి చెందాలని గట్టిగా కోరుతున్నారు. పైగా మరో నయాపైసా కూడా పెంచేది లేదంటున్నారు. దీనిపై ఆసుపత్రుల నిర్వాహకులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై సానుకూలంగానే కన్పిస్తున్నారు. ఈనెల 30తేదీ జరుగబోయే కీలక సమావేశంలో ప్రతిష్టంబన తొలగిపోయే సూచనలు కానవస్తున్నాయి.