ఆంధ్రప్రదేశ్‌

మాదీ సైకిలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 8: వైకాపాకు చెందిన తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు,నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఎనిమిది మంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో వలస పక్షుల సంఖ్య 10కి చేరుకుంది. ఈ నెల 11న జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరుతున్న సంగతి తెలిసిందే. వరుపుల సుబ్బారావు, సునీల్ చేరికను పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అభివృద్ధిని యజ్ఞంగా చేస్తున్నానని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పద్ధతి ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అయితే ప్రతిపక్షం ఎక్కడికక్కడ అడ్డుతగులుతోందని, ప్రజల్ని రెచ్చగొడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తుని ఘటనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజలు విజ్ఞతతో తనను గెలిపించారని, అభివృద్ధి కోసం తపిస్తున్నానని అన్నారు. కుల, మత, వర్గాలకు అతీతంగా పనిచేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

రెచ్చగొడితే చిట్టా విప్పుతాం: సునీల్
తాము డబ్బులు తీసుకుని టిడిపిలో చేరుతున్నామని జగన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తను వైకాపా ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టిడిపిలోకి వచ్చేస్తానని కోరానని, అయితే కొంత సమయం వైకాపాలోనే ఉండమని ఆదేశించారని సునీల్ అన్నారు. దేశంలో నిబద్ధతతో పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయనపై జగన్ అర్థలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. తమను రెచ్చగొడితే, వైకాపాలో తాము అనుభవించిన అవమానాలను బహిర్గతం చేయాల్సి వస్తుందని సునీల్ హెచ్చరించారు.
వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ తాను ఆనందంతో టిడిపిలోకి వచ్చానని అన్నారు. పార్టీ మారేందుకు తానొక్కడినే నిర్ణయం తీసుకోలేదని, పార్టీ క్యాడర్ మొత్తం తనను టిడిపిలో చేరమని కోరిందని అన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ జగన్ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ, ప్రతిపక్ష నాయకుని పదవిని అగౌరపరస్తున్నారని అన్నారు. నదుల అనుసంధానాన్ని అందరూ అభినందిస్తుంటే, జగన్ విమర్శించడం శోచనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తోట నరసింహులు తదితరులు పాల్గొన్నారు.