ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు జిల్లాలో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 27: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలో ఐదుగురికి స్వైన్‌ప్లూ సోకింది. వ్యాధి సోకిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నెల్లూరు నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూ లక్షణాలతో ఓ మహిళ ఈనెల 18న చేరింది. ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు వ్యాధి నిర్ధారణ కావడం, ఆమెకు డాక్టర్లు చికిత్స అందించి నయం చేశారు. జిల్లాలోని నాయుడుపేట ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడు తమిళనాడు రాష్ట్రం రాయవేలూరు వైద్య కళాశాలలో పిజి విద్యనభ్యసిస్తున్నాడు. స్వైన్‌ప్లూ సోకిన రోగులకు ఆయన చికిత్స అందించారు. అతనికి కూడా స్వైన్‌ప్లూ సోకగా, చెన్నై నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకోగా వ్యాధి నయమైంది. ఈ రెండు సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా జిల్లాలోని తమిళనాడు సరిహద్దుల్లో గల తడ మండలం రామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పూడి గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లతో పాటు మరో చిన్నారికి స్వైన్ ప్లూ సోకింది. అయితే వైద్యాధికారులు మాత్రం ఇద్దరి అక్కాచెల్లెళ్లకు సోకినట్లు నిర్ధారించారు. కాగా ఇంటి పక్కనే ఉన్న మరో చిన్నారికి కూడా సోకడంతో చెన్నైలో చికిత్స నిమిత్తం ఆ ముగ్గురిని చేర్పించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు చిన్నారులు చెన్నైలోని మెహతా చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సంక్రాంతికి చిన్నారులిద్దరూ తమ అమ్మమ్మ స్వస్థలం తమిళనాడులోని వేలూరుకు వెళ్లారు. అక్కడు నుంచి వచ్చిన తర్వాత ఈనెల 21న చిన్నారులిద్దరుతోపాటు మరో చిన్నారి జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో వారిని చెన్నై ఆసుపత్రిలో చూపించగా పరీక్షల అనంతరం వారి ముగ్గురికి స్వైన్‌ప్లూ సోకినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. రెండున్నర, ఏడాదిన్నర వయసు కలిగిన ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. వీరంతా బంధువులు కావడం గమనార్హం. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టరు వరసుందరంను ఆంధ్రభూమి ప్రతినిధి వివరణ కోరగా ఆయన జిల్లాలో నలుగురికి స్వైన్‌ప్లూ సోకిన మాట నిజమేనని స్పష్టం చేశారు. చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వైన్‌ప్లూ ఎక్కువగా ఉందని, సరిహద్దు జిల్లా కావడంతో నెల్లూరులోనూ కేసులు బైటపడుతున్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శనివారం నుంచి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. స్వైన్‌ప్లూ సోకిన చిన్నారుల బంధువులు 14 మందికి స్వైన్‌ప్లూ పరీక్షలు నిర్వహించామని, వ్యాధి లేదని తమ పరీక్షల్లో వెల్లడైందన్నారు. తిరుపతి స్విమ్స్‌లో స్వైన్‌ప్లూ నిర్ధారణ పరీక్ష, చికిత్స అందుబాటులో ఉందని, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏరియా వైద్యశాలలో నెబులైజర్లు, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. జిల్లా ప్రధానాసుపత్రిలో త్వరలోనే ఈ వ్యాధి నిర్ధారణ, చికిత్స అందుబాటులోకి రానుందన్నారు.