ఆంధ్రప్రదేశ్‌

భాగస్వామ్య సదస్సుతో చిగురించిన ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 28: విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్‌పై ఆశలు చిగురింప చేసే విధంగా చేసింది. ప్రత్యేక హోదా రాకపోతే, రాయితీలు రావని, అందువల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని విపక్షాలు అంటున్నాయి. హోదా వలన రాయితీలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.
ఇలాంటి మీమాంశలు ఉన్నప్పటికీ పారిశ్రామికవేత్తలు వీటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. విశాఖలో జరిగిన రెండు రోజుల భాగస్వామ్య సదుస్సకు ఫోర్బ్స్, ఆదిత్యా గ్రూప్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థల అధినేతలు తరలి రావడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబు నాయుడు ప్రసంగాలు పారిశ్రామికవేత్తల్లో మరింత ధైర్యాన్ని నింపే విధింగా ఉన్నాయి. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, అశోక్‌గజపతిరాజు, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రదాన్‌ను ఈ సదస్సుకు తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు కేంద్రంలో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అలాగే, ఏపికి కేంద్రం ఇచ్చే చేయూతను కేంద్ర మంత్రులు నేరుగా పారిశ్రామివేత్తలకు వివరించి, పెట్టుబడులను ఆకర్షించడంలో కృతకృత్యులయ్యారు.
ఈ సదస్సులో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా భారత్-అమెరికాల మధ్య రాజకీయ, వాణిజ్య సంబంధాలు, చైనా-్భరత్‌ల మధ్య వ్యాపార సంబంధాల గురించి అర్థవంతమైన చర్చ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ దేశానికి చెందిన మంత్రులే స్వయంగా వచ్చి ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం.
అలాగే నేపాల్, బంగ్లాదేశ్, జింబాబ్వే దేశాల వాణిజ్య శాఖ మంత్రులు, సింగపూర్, థాయిలాండ్, బూటాన్, రష్యా దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సదస్సులో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఇందులో 50 శాతం వరకూ కార్యరూపందాల్చవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రాలు.. సిఆర్‌డిఎలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న దృశ్యం. ముగింపు కార్యక్రమంలో గవర్నర్, సిఎం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు