ఆంధ్రప్రదేశ్‌

జల్లికట్టుకు..హోదాకు సంబంధం ఏంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 28: జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలనుకోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన తరువాత శనివారం రాత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల్లికట్టు ఒక సంప్రదాయ క్రీడ. దానికి హోదాకు ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్, ముఖ్యంగా యువత బాగోగుల గురించి తాను ఆలోచిస్తుంటే, ప్రతిపక్ష నేత రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన తాను కోరుకోలేదు. హేతుబద్ధంగా విభజన జరగలేదు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి సోనియా గాంధీ శాడిజాన్ని ప్రదర్శించారు. విభజన నేపథ్యంలో జగన్‌ను జైలు నుంచి బయటకు తీసుకువచ్చి, ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. చివరకు ఏమైంది? ప్రజల తీర్పు ఎలా ఉందో అంతా చూశారు. నేర చరిత్ర ఉన్న ప్రతిపక్ష నాయకుడు తనపై విమర్శలు చేయడం బాధాకరంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఒక నెంబర్-1 కూలీగా పనిచేస్తున్నాను. నా కుమారినికి, మనవడికి ఉద్యోగాలు అక్కర్లేదు. నా భార్య ఒక సంస్థకు యజమానురాలు. ఆమె సంపాదన ఆమెకు చాలు. నాకు డబ్బుపై వ్యామోహం లేదు.’ ఇటువంటి తనపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు అన్నారు. విశాఖలోని భాగస్వామ్య సదస్సును భగ్నం చేయడానికి జగన్ ప్రయత్నించారు. అదే జరిగి ఉండే, 50 దేశాల్లో మన పరువు పోయుండేది. అటువంటి వ్యక్తి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టి సదస్సు సజావుగా సాగిందని చంద్రబాబు చెప్పారు. యువత కూడా ఆలోచించాలి. రాష్ట్భ్రావృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారు. రాష్ట్ర విచ్ఛిన్నం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవాలి. తెలుసుకుని భవిష్యత్‌లో తగిన తీర్పు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు ఎంత బెదిరించినా, తాను భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు.