ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో అల్లరి చేసిన వైకాపా ఎమ్మెల్యేలపై వేటు వేద్దామా? వద్దా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అల్లరి చేసిన 12 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేద్దామా? లేక భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిక చేసి వదిలి వేద్దామా? అనే అంశంపై ఎపి ప్రివిల్లేజస్ కమిటీ తర్జన-్భర్జన పడి చివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. ప్రివిల్లేజస్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన శనివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. పైగా దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్య తీసుకునేందుకు సిడీలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రివిల్లేజస్ కమిటీని ఆదేశించారు.
ఈ మేరకు కమిటీ సిడీని పరిశీలించి 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపించింది. దీంతో కొడాలి వెంకటేశ్వర రావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామలింగేశ్వర రావు, కొరముట్ల శ్రీనివాసులు, చర్ల జగ్గిరెడ్డి, ఆర్. సూర్యప్రకాశ్ రెడ్డి, పినె్నల్లి రామకృష్ణా రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, బి. ముత్యాల నాయుడు, డాక్టర్ ఎం. సునీల్ కుమార్, ఎ. సంజీవయ్య, కంబాల జోగులు కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించడంతో పాటు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. ఇలాఉండగా శనివారం కమిటీ చైర్మన్ గొల్లపల్లి అధ్యక్షతన కమిటీ సభ్యులు డి. శ్రవణ్ కుమార్. ఎ. రామకృష్ణ, బిసి జనార్దన్ రెడ్డి(టిడిపి), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైకాపా) సమావేశమై చర్చించారు.
సమావేశానంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలు, అన్ని పార్టీలూ ఉద్యమిస్తున్నాయని, ఆ రోజున కూడా తాము ప్రత్యేక హోదా కోసమే ఉద్యమించామని, ఆవేశంతో స్పీకర్ పోడియం వద్దకు దూసుకుని వచ్చినప్పుడు ఎవరి మనసుకైనా బాధ కలిగినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. చర్య తీసుకుంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి నిరంకుశంగా వ్యవహారిస్తున్నదని భావించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఆ రోజున ఏడిపించలేదా?
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కంట తడి పెట్టారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.