ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల సమస్యలకు నెలలో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: ఆంధ్ర ప్రాంత అర్చకుల సమస్యలను స్నేహ పూర్వక విధానంలో పరిష్కరిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. విజయవాడలోని కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం అర్చక ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యలకు ఒక్క నెలలోనే సానుకూల పరిష్కారాన్ని చూపిస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళతామని హామీ ఇచ్చారు. అర్చకులు ఆందోళన మార్గం చేపట్టవద్దని, హేతుబద్ధమైన విధానంలో పరిష్కారాన్ని చూపుతామని వివరించారు.