ఆంధ్రప్రదేశ్‌

పవన్‌తో ఒరిగేది శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 28: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప అన్నారు. శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి వచ్చిన ఆయన మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, టిడిపి చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు నందం అబద్దయ్య, ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, కౌన్సిలర్ ఉడతా శ్రీనుతో కలిసి చేనేత వాడల్లో పర్యటించారు. మగ్గాలను పరిశీలించి కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ చేనేత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటుడు పవన్‌కల్యాణ్ ఉండటం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. అన్ని సమస్యలపై పవన్‌కల్యాణ్ పోరాటాలు చేసినా ఎన్నింటిలో సఫలీకృతం అయ్యాడో తెలుసుకోవాలన్నారు. వడ్డించే వారిని వదిలి ఆకులు ఎత్తివేసే వారి దగ్గరికి వెళితే ఉపయోగం ఏముంటుందని కిష్టప్ప వ్యాఖ్యానించారు. స్వర్ణకార సంఘం నేతలు, కాపు సంఘం నేత దుర్గారావు కిష్టప్పను సత్కరించారు.