ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జనవరి 28: పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను సిడబ్ల్యుసి ఛైర్మన్ పరమేశ్వరన్ శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఉదయమే చేరుకున్న ఛైర్మన్ బృందానికి ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు స్వాగతం పలికారు. అనంతరం సిడబ్ల్యుసి ఛైర్మన్ ట్విన్ టన్నల్స్ (జంట సొరంగాలు)ను హెడ్ రెగ్యులేటర్, స్పిల్‌వే కాంక్రీట్ పనులతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయనకు ఇఎన్‌సి ఎస్‌ఇలు పనులపై వివరించారు.
అనంతరం కాంట్రాక్టు ఏజెన్సీ కార్యాలయంలోని ప్రాజెక్టు నమూనా ద్వారా ప్రాజెక్టు పనితీరును వివరించారు. అనంతరం పవర్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టులో జరిగిన పనులను, జరుగుతున్న పనుల వివరాలతోపాటు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు తీరును ఎస్‌ఇ రమేష్‌బాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ పనుల డిజైన్ల అనుమతులు అంచెలంచెలుగా అప్రూవల్ చేస్తున్నామని ఛైర్మన్ తెలిపినట్టు ఎస్‌ఇ తెలిపారు. అలాగే మహారాష్టక్రు చెందిన జలవనరుల శాఖకు చెందిన నలుగురు ఎస్‌ఇలు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారని ఎస్‌ఇ రమేష్ వెల్లడించారు. శనివారం ఉదయం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి మహారాష్టక్రు చెందిన ఇంజనీరింగ్ అధికారులు బెలసర, దేవ్‌గాడే, సొంప్కె గావాలి చేరుకున్నారు. వారు ప్రాజెక్టు పనులను పరిశీలించాలని, ఆ తరువాత ప్రాజెక్టు నమూనా ద్వారా వివరాలు తెలుసుకున్నట్టు చెప్పారు. అనంతరం ఇఇలు వారికి ప్రాజెక్టు నిర్మాణాలపై వివరించినట్టు ఎస్‌ఇ రమేష్‌బాబు తెలిపారు.

చిత్రం..పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పనులను పరిశీలిస్తున్న పరమేశ్వరన్