ఆంధ్రప్రదేశ్‌

హిందూ ఆలయ వ్యవస్థపై అంతర్జాతీయ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జనవరి 28: హిందూ దేవాలయ వ్యవస్థపై అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో జరిగిన సంఘటన దీనికి బలం చేకూరుస్తోందన్నారు. తిరుమలలో ఓ ముస్లిం వ్యాపారి నమాజు చేయగా అధికారులెవరూ పట్టించుకోలేదన్నారు. తిరుమల క్షేత్రం అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శమని అన్నారు. పటిష్టమైన భద్రతా వలయాలను తప్పించుకుని ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల క్షేత్రంలోకి ప్రవేశించిన ఆ వ్యాపారి ప్రార్థన చేయడం సెక్రూరిటీ డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. వేషభాషలను బట్టి అన్యమతస్థులను ఇట్టే గుర్తించవచ్చన్నారు. వాస్తవానికి అలిపిరి టోల్‌గేట్ వద్దే అతడిని నిలువరించాల్సి ఉందని, టోల్‌గేట్ వద్ద తప్పించుకుని, సెక్యూరీటి కళ్ళుగప్పి వైకుంఠం కాంప్లెక్స్‌లోకి వెళ్లి నమాజ్ చేసినా భద్రతా సిబ్బంది గుర్తించలేకపోవడం శోచనీయమన్నారు. కొంతమంది భక్తులు, విహెచ్‌పి కార్యకర్తలు ఇది గమనించి సిబ్బందికి సమాచారం ఇస్తే అప్పుడు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఎలాంటి విచారణ లేకుండా ఆ వ్యక్తిని వదిలేయాలని చూశారని, అయితే విహెచ్‌పి కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఆ వ్యక్తిని విచారించారన్నారు. విచారణలో వెల్లడైన వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్‌లో శిక్షణ పొందిన వ్యక్తి తిరుమలకు వచ్చి ప్రార్థనలు చేస్తుంటే మన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది హిందూ దేవాలయ వ్యవస్థపై అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలో భాగమేనన్నారు. ఇలాంటి కుట్రలు చేసి వాట్సాప్, ఫేస్‌బుక్క్‌ల్లో పెట్టి అన్యమతస్థులు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు.
కొంతమంది అధికారులు అలాంటి వారికి సహకరిస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. గతంలో ఒక చర్చ్ఫిదర్ తిరుమలలో ప్రచారం చేశాడని, అప్పుడు సైతం భద్రతా సిబ్బంది, టిటిడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అన్యమతస్థులను అడ్డుకోని టిటిడి అధికారులు తిరుమల పవిత్రత కాపాడాలని డిమాండ్ చేసిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం విచారకరమన్నారు. హిందూ దేవాలయాల్లో హిందువులనే అధికారులుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్యమస్థులను అధికారులుగా నియమించి హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దన్నారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బసవన్నగౌడ్ పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న నందిరెడ్డి సాయిరెడ్డి