ఆంధ్రప్రదేశ్‌

జనరిక్ మందుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 28: పేద ప్రజలకు జనరిక్ ఔషధాలను తక్కువ ధరకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్న సంజీవిని ప్రభుత్వ జనరిక్ మందుల షాపులు సత్ఫలితాలిస్తున్నాయి. 2016 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 నాటికి రూ.17 కోట్ల 71లక్షల 46వేల 711 మొత్తానికి మందుల విక్రయాలు జరిగాయి. ఇవే మందులు సాధారణ మెడికల్ షాపుల్లో కొంటే ఐదు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. త్వరలో మరో వెయ్యి షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖరీదైన వైద్యం కోసం పేదలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టిన ప్రభుత్వం నిత్యం సామాన్యుడు ఉపయోగించే మందుల ధరలను సైతం అందుబాటులో వుంచాలని భావిస్తోంది. దానికి అనుగుణంగా కీలక వ్యాధులకు ఉపయోగించే అనేక మందులను 70 శాతం వరకు తక్కువ ధరకు జనానికి అందిస్తోంది. ప్రధానంగా షుగర్, బిపి, హృద్రోగానికి ఉపయోగించే ట్యాబ్లెట్ల ధరలు సాధారణ మందులతో పోలిస్తే 50 నుంచి 100 శాతం వరకు తేడా కన్పిస్తోంది. మందులను విరివిగా వినియోగించాలని.. ఇవి సాధారణ మందులతో సమానంగా పనిచేస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు ఎలాంటి అపోహలు పడాల్సిన పనిలేదని, ఈ మందులు కూడా సాధారణ మందుల వలే పనిచేస్తాయని, కేవలం పేటెంట్ కాలం పూర్తయిన మందులు... అదే ఔషధ విలువలతో అందుబాటులో వుంటున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాల వారీగా అమ్మకాలు
ఇదిలా వుండగా శ్రీకాకుళం జిల్లాలో 17 అన్న సంజీవని గవర్నమెంట్ జనరిక్ మెడికల్ షాపులకు గాను 83 లక్షల 31వేల 331 రూపాయల అమ్మకాలు జరిగాయి. విజయనగరం జిల్లాలో 17 షాపులకు సంబంధించి 96 లక్షల 39వేల 246 రూపాయల అమ్మకాలు జరిగాయి. విశాఖపట్టణం జిల్లాలో 30 షాపులకు గాను రెండు కోట్ల 60 లక్షల 35వేల 873 రూపాయల అమ్మకాలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో 20 షాపులకు గాను కోటీ నాలుగు లక్షల 63వేల 337 రూపాయల అమ్మకాలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 50 షాపులకు సంబంధించి రెండు కోట్ల 92 లక్షల 86వేల 482 రూపాయల అమ్మకాలు చేశారు. కృష్ణాజిల్లాలో 18 అన్న సంజీవిని గవర్నమెంట్ జనరిక్ మెడికల్ షాపులకు గాను కోటీ 39 లక్షల 33వేల 384 రూపాయల అమ్మకాలు నమోదయ్యాయి.
గుంటూరు జిల్లాలో 15 షాపులకు గాను 81 లక్షల 45వేల 589 రూపాయల అమ్మకాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో 23 షాపులకు గాను 2కోట్ల 79 లక్షల 51వేల 478 రూపాయల అమ్మకాలు చేశారు. నెల్లూరు జిల్లాలో 7 మెడికల్ షాపులకు గాను 21 లక్షల 62వేల 844 రూపాయల అమ్మకాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో మొత్తం 16 అన్న సంజీవిని గవర్నమెంట్ జనరిక్ మెడికల్ షాపుల్లో ఏడాది కాలంలో కోటీ 23 లక్షల 26వేల 113 రూపాయల అమ్మకాలు జరిగాయి. కడప జిల్లాలో 19 షాపులకు సంబంధించి 76 లక్షల 17వేల 848 రూపాయల అమ్మకాలు నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 9 జనరిక్ షాపులకు గాను కోటీ 65 లక్షల 22వేల 78 రూపాయల మందుల అమ్మకాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో 13 షాపులకు గాను ఏడాది కాలంలో రూ.47 లక్షల వెయ్యి వంద రూపాయల అమ్మకాలు నమోదయ్యాయి. కాగా మొత్తం మీద ఏడాది కాలంలో 254 అన్న సంజీవిని గవర్నమెంట్ జనరిక్ మెడికల్ షాపుల నుంచి రూ.17 కోట్ల 71 లక్షల 46వేల 711 మందులను విక్రయించారు. ఇక పథకం ప్రారంభంచిన అక్టోబర్ 1, 2015 నుంచి జనవరి 27, 2017 వరకు 20 కోట్ల 23 లక్షల 72వేల 883 రూపాయల జనరిక్ మందుల అమ్మకాలు జరిగాయి.
త్వరలోనే కొత్త అన్న సంజీవిని మెడికల్ షాపులు
త్వరలోనే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి అన్న సంజీవిని గవర్నమెంట్ జనరిక్ మెడికల్ షాపులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంకేతిక కమిటీ చైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావ్ వివరించారు. అన్న సంజీవిని మందులను ఉపయోగించటంపై అటు ఆసుపత్రి వర్గాలతో పాటు, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. పేద ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురు కాకూడదన్న ఏకైక ఉద్దేశంతో అన్న సంజీవిని మందుల షాపులను ప్రారంభించిందని, ప్రజలు డాక్టర్లు ఇచ్చిన ప్రిస్కిప్షన్ తీసుకుని జనరిక్ షాపుల్లో మందులు కొనుగోలు చేయవచ్చని ఆయన చెప్పారు. వైద్యులను సైతం జనరిక్ మందులు రాయాల్సిందిగా డిమాండ్ చేయమని ఆయన రోగులకు సూచించారు. ఏడాది కాలంలో అన్న సంజీవిని మెడికల్ షాపులు రూ.18 కోట్ల మేర అమ్మకాలు సాగించడం ఆహ్వానించదగ్గ పరిణామమని, వచ్చే రోజుల్లో పెద్దఎత్తున అమ్మకాలు జరిపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు వెంకట్రావ్ చెప్పారు.