ఆంధ్రప్రదేశ్‌

ఈసారి వచ్చేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 28: అన్ని కార్యక్రమాలను ఒక భారీ ఈవెంట్‌లా నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం ఇకపై వాటిని నిర్వహించే పెద్ద కంపెనీలను వెతుక్కోవలసిందే! ఎందుకంటే, ఏపికి వచ్చి కష్టాలు పడేందుకు సిద్ధంగా లేమని భారీ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి కాబట్టి! పనులు చేస్తున్నప్పుడు అధికారులకు ముడుపులు చెల్లించుకోవడం, తర్వాత పనుల బిల్లుల కోసం నెలల తరబడి వారిచుట్టూ తిరగడం తమ వల్లకాదని, ఇకపై తాము ఏపికి వచ్చేదిలేదని భారీ కంపెనీలు నిర్మొహమాటంగా చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా పుష్కరాలను రంగరంగ వైభవంగా నిర్వహించి జాతీయస్థాయిలో ప్రచారం పొందిన ప్రభుత్వం, ఆ పనులు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన భారీ కంపెనీలకు మాత్రం ఇప్పటివరకూ బిల్లులు చెల్లించడంలో విఫలమయింది. వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడ వచ్చి, ఇక్కడే మకాం వేసి పనులు పూర్తయ్యేవరకూ ఉన్న పెద్ద కంపెనీలను అధికారులు బిల్లుల పేరిట వేధిస్తున్న వైనం వారికి విసుగు తెప్పించింది. దాంతో ఇక ఏపిలో జరిగే ఎలాంటి భారీ ఈవెంట్లలోనూ తాము పాల్గొనేది లేదని ఆయా కంపెనీలు అధికారులకు నిర్మొహమాటంగా చెబుతున్నాయి. వందల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇంతవరకూ ఆ పనులు చేసిన కంపెనీలకు బిల్లులు చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మరి ఆ డబ్బు ఏమయిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విజయవాడ నగర పాలక సంస్థ పరిథిలో 250 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఈసారి లైటింగ్, గ్రీనరీ, తాత్కాలిక టాయిలెట్లు వంటికి ఎక్కువ కేటాయించారు. వైబ్రెంట్ గుజరాత్, కచ్‌లో రన్ ఉత్సవ్, ఉజ్జయిని, కుంభమేళా, గురునానక్ జయంతి వంటి భారీ ఈవెంట్లు నిర్వహించిన గుజరాత్ కంపెనీ సహా పెద్ద కంపెనీలే కృష్ణా పుష్కరాలకు పనులు చేశాయి. అయినా అలాంటి భారీ కంపెనీ ప్రతినిధులే ఇప్పుడు గత నాలుగు నెలల నుంచి విజయవాడ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే, పుష్కరాలు ముగిసి ఆరునెలలయినా ఇప్పటివరకూ సగం మాత్రమే బిల్లులు చెల్లించారు. బిల్లుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు వస్తున్న ఆయా కంపెనీల అధికారులు, వారాల తరబడి వేచి ఉండటం, అధికారుల చుట్టూ తిరగడం మామూలయిపోయింది. బిల్లులు రాకపోగా, విజయవాడలో మకాం ఖర్చులు తడిసి మోపెడవుతుండటం మరో సమస్యగా మారింది. దానితో ఇటీవల ఒక అధికారి వద్దకు వెళ్లిన ఓ కంపెనీ ప్రతినిధి ‘మీ ఆంధ్రాకు ఇక మేం రాము. మీదంతా పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు, మేం చాలా పెద్ద ఈవెంట్లు చేశాం. కానీ ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. బడ్జెట్ లేనప్పుడు ఈవెంట్లు ఎందుకు చేస్తున్నారు’ అని మొహం మీదనే కడిగిపారేసినట్లు సమాచారం. ఒక్క కృష్ణా పుష్కరాలే కాదు, గత రాజమండ్రి గోదావరి పుష్కరాల పనులకూ ఇంతవరకూ బిల్లులు విడుదల చేయలేదన్న మరికొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే భారీ ఈవెంట్లు నిర్వహించే సమర్థత ఉన్న పెద్ద కంపెనీలు ఏపికి రావడం కష్టమేనని, ఏపి ప్రభుత్వం పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వడం లేదన్న ప్రచారం ఇతర రాష్ట్రాల్లో జరిగితే ఎవరూ ముందుకు రారని, ఆ స్థాయి సమర్థత కలిగిన కంపెనీలు మనకు లేవని అధికారులు చెబుతున్నారు.