ఆంధ్రప్రదేశ్‌

కాలుష్యరహిత వనరుల వినియోగం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జనవరి 28: కాలుష్యరహిత వనరుల వినియోగం పెరిగితే దేశం భవిష్యత్తులో అగ్ర రాజ్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి, శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం సుమారు 5.75 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రసాదంగా సిద్ధించిన సూర్యకిరణాలను మానవ అవసరాలకు ఉపయోగించినప్పుడే సత్ఫలితాలు సాధించగలమన్నారు. అతి తక్కువ సూర్య కిరణాలు ఉత్పత్తవుతున్న జపాన్, సౌరశక్తి వినియోగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడాన్ని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. మనదేశంలో వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోకకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుకోలేని దేశానికి భవిష్యత్తు ఉండదన్నారు.