ఆంధ్రప్రదేశ్‌

పార్లమెంటులో హోదా పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు పోరాడాలని వైకాపా పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఒక వేళ కేంద్రం తమ డిమాండ్‌ను ఆమోదించకుండా, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అటకెక్కించే ప్రయత్నం చేస్తే ఎంపి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలను కోరారు. ఆదివారం ఇక్కడ వైకాపా పార్టీ కార్యాలయం లోటస్‌పాండ్‌లో వైకాపా ఎంపీల సమావేశం జరిగింది. ఈ నెల 1వ తేదీన తొలిసారిగా సార్వత్రిక బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ను కలిపి ఒకేసారి ప్రవేశపెట్టనున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై పార్లమెంటులో నిలదీయాలని జగన్ ఆదేశించారు. ఈ సమావేశం దాదాపు రెండుగంటల సేపు జరిగింది. అనంతరం పార్లమెంటరీ పార్టీ కమిటీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమ్మిట్‌ల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని, హోదా డిమాండ్‌ను పాతపెట్టారన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామన్న హామీపై కేంద్రంపై వత్తిడి చేయలేదన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీతో పోల్చి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంపై వత్తిడి తెస్తామన్నారు. ఈ సమావేశాల్లోనే హోదాపై ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టన్నుట్లు చెప్పారు. హోదా వల్ల వంద శాతం ఆదాయం పన్ను, ఎక్సైజ్ పన్ను రాయితీలు వస్తాయన్నారు. వైకాపా ఎంపి మిథున్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అంకెల గారడీతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, విశ్వసనీయతను కోల్పోయారన్నారు. కడప స్టీలు ఫ్యాక్టరీపై కేంద్రంతో మాట్లాడకుండా కాలక్షేపం చేస్తున్నారన్నారు. అన్ని పార్టీల ఎంపిలు కలిసి పార్లమెంటులో హోదా కోసం పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. హోదాపై రాజీలేదన్నారు. జగన్ ఆదేశాల మేరకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉందని, హోదా కంటే మించిన అంశం మరొకటి లేదని కర్నూలు ఎంపి బుట్టా రేణుక అన్నారు.