ఆంధ్రప్రదేశ్‌

టిటిడికి ‘రక్షణ దళం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 29: తిరుమలలో ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించేందుకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తులను కాపాడేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా టిటిడికి ఒక రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఆదివారం తిరుమలలో పోలీస్ మిత్ర అవగాహన సమావేశం స్థానిక పుష్పగిరి మఠంలో పోలీస్, రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ విభాగాన్ని తొలిసారిగా ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో సివిల్ డిఫెన్స్ కాలేజీ ఉందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ సివిలియన్ డిఫెన్స్ విభాగం ఉందన్నారు. అక్కడ నుంచి శిక్షకులు వచ్చి ఈ రక్షణ దళానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారన్నారు. అలాగే టిటిడి సైతం అనేక ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఈపరిస్థితుల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే వాటిని స్థానికంగా ఉన్నవారు స్పందించి రంగంలోకి దిగేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇందులో స్థానికంగా ఉన్న యువత, మహిళలను ఎక్కువగా భాగస్వాములను చేయాలన్నది తమ ఆలోచన అన్నారు. నాలుగు రోజులపాటు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రాథమిక వైద్యం అందించేలా ఈ బృందానికి శిక్షణ ఇస్తారన్నారు. కార్డియో పల్మరీ రీసెర్చ్ టెక్నిక్ కూడా నేర్పిస్తారని తెలిపారు. ప్రధానంగా తిరుమలలో నివసిస్తూ ఈ శిక్షణ పొందడానికి ఆసక్తి ఉన్న వారిని భాగస్వాములను చేయనున్నామని తెలిపారు. వీరందరిని ప్రధానమైన సందర్భాల్లో బందోబస్తుకు వినియోగించుకుంటామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆలయాలకు సంబంధించి ఇలాంటి ఒక దళం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని, ఇది తనకెంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక మహిళలను భాగస్వాములను చేస్తారా అన్న ప్రశ్నపై ఎస్పీ జయలక్ష్మి స్పందిస్తూ తాము మహిళలను కూడా ఆహ్వానించామని కొందరు రావడానికి తటపటాయిస్తున్నారన్నారు. మరి కొందరు ముందుకు వచ్చారని తెలిపారు. ఇక పోలీస్ శాఖాపరంగా విజిలెన్స్ విభాగానికి సంబంధించి 26 మంది, తిరుమల పోలీస్ నుంచి 20 మంది, తిరుమల పోలీస్ మిత్ర నుంచి 60 మంది ప్రస్తుతం ఈశిక్షణ పొందుతున్నారని చెప్పారు. ఈ 106 మందిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారని ఎస్పీ తెలియజేశారు.