ఆంధ్రప్రదేశ్‌

హోదాపై దోబూచులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 9: విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా రాష్ట్రానికి 5 లక్షల కోట్ల నిధులు అందించాల్సి ఉండగా కేవలం 5 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం రాష్ట్ర ప్రజలకు విదిల్చి చేతులు దులుపుకుందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం గుంటూరు నగరానికి విచ్చేసిన రఘువీరా స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలు దోబూచులాడుతున్నాయని, ప్రత్యేక హోదా విషయమై సిఎం చంద్రబాబు ప్రధానిని అడగకుండా క్యాబినెట్ సెక్రటరీని అడిగి తన స్థాయిని దిగజార్జుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేవలం ఒక్క శాతం నిధులు మాత్రమే రాష్ట్రానికి ఇవ్వగా ఇంకా 99 శాతం నిధులు విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఏడాది నుండి చేపడుతున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు సభ ఈనెల 11వ తేదీన నాగపూర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో పాలన సాగిస్తున్న దృష్ట్యా వారికి కనువిప్పు కలిగేందుకే 2 లక్షల మందితో ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రమైన నాగపూర్‌లోనే సభను నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందన్నారు. జన్మభూమి కమిటీ కారణంగా పలు అవకతవకలు జరుగుతున్నాయని, రాష్ట్రప్రభుత్వ పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు అందడం లేదని, అందుకే వారికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలిచి పోరాడుతోందన్నారు. ఈనెల 20వ తేదీన గుంటూరులోని మహిమాగార్డెన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి భయాందోళనలో ఉన్న బడుగు, బలహీన వర్గాలకు భరోసా ఇస్తామన్నారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.