ఆంధ్రప్రదేశ్‌

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ఏర్పాట్లు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇబ్రహీంపట్నం), ఫిబ్రవరి 7: జాతీయ మహిళా పార్లమెంట్ పనులు వేగవంతం చేయాలని సమయం దగ్గర పడుతుందని రాష్ట్ర బిసి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇబ్రహీంపట్నం ఫెర్రి పవిత్ర సంగమం ఘాట్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. జిల్లా పరిషత్ సభ్యురాలు రాధా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగమం ఘాట్ పనులు గ్రీనరీ పనులు, షెడ్డు, విద్యుత్ లైట్లు ఆనందాన్ని తెలుపుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రామినేని రాజశేఖర్, చెన్నుబోయిన చిట్టిబాబు, చనమోలు నారాయణ, లంబు వాసు, సైదులు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.