ఆంధ్రప్రదేశ్‌

కరవు జిల్లాగా ప్రకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 14: ప్రకాశం జిల్లాలోని 56మండలాలను కరవుమండలాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమేరకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం జిఒఎంఎస్ నెంబరు రెండును విడుదల చేయటంతో జిల్లాలోని పాలక,ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 46 మండలాలను మాత్రమే కరవుమండలాలుగా ప్రకటించగా మిగిలిన 10 మండలాలను కరవుమండలాలుగా ప్రకటించాలని పాలక,ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం కూడా జిల్లామొత్తాన్ని కరవుజిల్లాగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ రాష్ట్రప్రభుత్వానికి నివేదిక పంపించింది. జిల్లా మొత్తాన్ని కరవుజిల్లాగా ప్రకటించేందుకు రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
ప్రతిపక్షాల తరుపున ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి పలుమార్లు జిల్లా మొత్తాన్ని కరవుజిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.