ఆంధ్రప్రదేశ్‌

వర్శిటీలకు ర్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు, ప్రైవేటు, డీమ్డ్ వర్శిటీలకు ర్యాంకులు ఇచ్చేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సిద్ధమైంది. గత ఏడాది కేవ లం కొద్ది విద్యాసంస్థలను మాత్ర మే గుర్తించి వాటికి ర్యాంకులు ఇచ్చిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈసారి వర్శిటీలు అన్నింటికీ ర్యాంకులు ఇవ్వనుం ది. దాంతో ప్రతి రాష్ట్రంలో ఉత్తమ యూనివర్శిటీలు, వౌలిక సదుపాయాలు లేని వర్శిటీల జాబితా తేటతెల్లం కానుంది. ఇప్పటికే ఇందుకు కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాం కింగ్ ఫ్రేమ్ వర్కును రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల నుండి ఇప్పటికే డాటాను సేకరించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఆ డాటా ప్రాతిపదికపై ర్యాంకులు ఇవ్వనుంది. ఈ ర్యాంకులను ఈ ఏడాది ఏప్రిల్ 3న ప్రకటించనుంది. 2015 సెప్టెంబర్ 29న ర్యాంకుల విధానాన్ని కేంద్ర ప్రభు త్వం ప్రారంభించింది.