ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ క్రీడా వేదికగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా నవ్యాంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు అన్నారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం హిందూ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలను గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు ముందే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున స్టేడియంలను నిర్మించి సుశిక్షుతులైన క్రీడాకారులను తయారు చేశారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 13 జిల్లాల్లో స్టేడియంల నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా అకాడమిల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాచీన క్రీడ అయిన విలువిద్యను మరింత ప్రోత్సహించేందుకు గాను విజయవాడలో అకాడమి ఏర్పాటుకు స్థలానే్వషణ చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తయారు చేస్తామన్నారు. బందరులో 22 ఎకరాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.2కోట్లు నిధులు విడుదలైనట్లు తెలిపారు. త్వరలోనే స్టేడియం నిర్మాణ పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ డి సూర్యచంద్రరావు, ఎపి ఆర్చరి అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మచిలీపట్నంలో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ ఆర్చరీ పోటీల్లో విల్లంబులు ఎక్కుపెట్టిన మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర