ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్ పరిధిలోకి రేషన్‌కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరుపుకునే దిశగా రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ కార్డులను మరో వారం రోజుల్లో ఎన్‌పిసిఎల్ (పేమెంట్ గేట్వే) పరిధిలోకి తీసుకువచ్చి ఆన్‌లైన్‌లోకి అనుసంధానించాలని జిల్లా అధికారులను పౌరసరఫరాల కమిషనర్ బి.రాజశేఖర్ ఆదేశించారు. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు మరిన్నిటిని అందుబాటులోకి తెస్తామని, జూన్‌కల్లా రాష్టమ్రంతా కిరోసిన్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి, అందరికీ ఎల్పీజీ గ్యాస్ పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరా అధికారులు, బ్యాంకర్లతో రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణాజిల్లా నగదు రహిత లావాదేవీల్లో అగ్రస్థానంలో ఉందని, ఇదే మాదిరిగా మిగిలిన జిల్లాల్లో కూడా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన అధికారుల కార్యగోష్ఠిని విజయవాడలో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. రాష్టవ్య్రాప్తంగా కోటికి పైగా రేషన్ కార్డులున్నాయని, వాటిలో 15 లక్షల మంది కార్డుదారులు నగదు రహిత లావాదేవీలు చేస్తున్నారు. మార్చి నెలాఖరులోగా చౌకధర దుకాణాల్లో 60 శాతం నగదు రహిత చెల్లింపులు జరగాలని, నగదుతో లావాదేవీలు తగ్గించాలని అధికారులకు రాజశేఖర్ సూచించారు.
చౌక దుకాణాల్లో త్వరలో తృణధాన్యాలు
జొన్నపిండి, రాగులు, సాములు వంటి తృణ ధాన్యాలను దశలవారీగా రేషన్ షాపుల్లోకి త్వరలో అందుబాటులోకి తెస్తామని పౌర సరఫరాల కమిషనర్ వెల్లడించారు. కిలో రూపాయికి బియ్యం లాగే ఈ తృణ ధాన్యాలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. నూనెలు, ఉప్పు, ఇతర నిత్యావసర వస్తువులు మార్కెట్ ధరల కన్నా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని, ఏ పప్పులు తీసుకున్నా కిలో 70 రూపాయలకే రేషన్ షాపులో లభిస్తుందనే విషయాన్ని తెలిసేలా అధికారులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజశేఖర్ తెలిపారు. అయితే ఎప్పుడో ఇచ్చే వాటితోపాటు అదనంగా ఇచ్చే నిత్యావసర వస్తువులను సమీకరించుకొని షాపుల్లో అందుబాటులోకి పెట్టడానికి డీలర్లకు భరోసా ఇచ్చేలా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. డీలర్లకు ఒక నెల క్రెడిట్ సదుపాయాన్ని ఇవ్వడం, ముద్ర బ్యాంకు ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించడం చేస్తే ఉత్సాహంగా అదనపు సరకులను కూడా వారు అందుబాటులో ఉంచుతారని అధికారులకు రాజశేఖర్ సూచించారు. రాష్ట్రంలో అర్హులైన కార్డుదారులు సంతృప్తి చెందేలా సేవలు అందాలని అధికారులకు ఆయన సూచించారు. ఎస్సీ ప్రణాళిక, గిరిజన సంక్షేమం కింద ఆయా వర్గాల వారికి ఎల్పీజీ గ్యాస్ పంపిణీపై వెంటనే దృష్టి పెట్టాలని, కిరోసిన్ వినియోగాన్ని క్రమేణా తగ్గించివేయాలని కమిషనర్ రాజశేఖర్ జిల్లా అధికారులకు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వంట నూనె చౌకధర దుకాణాల ద్వారా కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. చౌకగా లభిస్తుందని బయట నకిలీ నూనెలను కొనే అలవాటునుంచి వారిని తప్పించాలని అన్నారు.