ఆంధ్రప్రదేశ్‌

విధివంచితులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 20: చేసింది చిన్నతప్పైనా.. ఎటువంటి విచారణ లేకుండా కేసు నమోదు చేశారు. పోలీసుల దృష్టిలో ఆ నేరం పెద్దదే. చేసిన చిన్నతప్పుకు చింతిస్తునే పాఠశాలకు వెళ్ళగా ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు లోనికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మరోవైపు పోలీసులు 324సెక్షన్‌పై జూవైనల్ కేసునమోదు చేసి వెంటాడటం మొదలు పెట్టారు. దీంతో ఓ బాలుడు మనస్తాపంతో పరార్ కాగా, మరోబాలుడు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఓవైపు పాఠశాలకు రానివ్వకపోవడం, మరోవైపు పోలీసులు వెంటాడటం మొదలు పెట్టడంతో ఆ బాలుడు విధివంచితుడై.. ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేఔట్‌లోని వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రెడ్డినరసింహులు, పురం విజయకుమార్ 8వ తరగతి, ప్రసాద్ ఆరవ తరగతి చదువుకుంటున్నారు. వీరంతా నీరుగట్టువారిపల్లె వెంకటేశ్వరపురం దర్గారోడ్డులో నివాసముంటున్నారు. ఇంటివద్ద ఆటలాడుకుంటూ రెడ్డినరసింహులు మూత్రం పోస్తుండగా, పురం విజయకుమార్, ప్రసాద్ కోసురాయిని విసిరారు. అది ఏకంగా మర్మాంగంపై పడి రక్తగాయమైంది. ఈసంఘటన గత ఏడాది డిసెంబర్ 28న జరిగింది. దీంతో నరసింహులు తల్లిదండ్రులు మదనపల్లె రూరల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండానే ఇద్దరు చిన్నారులపై 324సెక్షన్‌పై జూవైనల్ కేసునమోదు చేశారు. అయితే ఎలాంటి విచారణ చేపట్టకుండానే కేవలం ఫిర్యాదుపైనే ఇద్దరి చిన్నారులపై జూవైనల్ కేసునమోదు చేయడంతో ప్రసాద్ అనే విద్యార్థి భయంతో పరారీలో ఉన్నాడు. విజయకుమార్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాలలో ప్రసాద్ దీర్ఘకాలికంగా పాఠశాలకు రాకపోవడంపై అతని పేరును రిజిస్టర్ నుంచి తొలగించారు. ఇదిలావుండగా పురం విజయకుమార్‌ను పాఠశాలకు రానివ్వకుండా ప్రధానోపాధ్యాయులు, తరగతి ఉపాధ్యాయులు సైతం అడ్డుకుని ఇంటికి పంపిం చేశారు. దీంతో విజయకుమార్ తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి బతిమలాడినా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ససేమిరా అనడంతో చేసేదిలేక వెనుదిరిగారు. దీంతో గత వారంరోజులుగా పోలీసులు ప్రసాద్, విజయకుమార్‌లను అరెస్టు చేసేందుకు పాఠశాలకు, వారి ఇళ్ళవద్దకు తిరుగుతుండగా తీవ్ర మనస్తాపం చెందిన విజయకుమార్ సోమవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నంకు పాల్పడటంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు తరలించారు. దీంతో మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.