ఆంధ్రప్రదేశ్‌

వడ్డీ భారం తగ్గించుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వడ్డీ భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎక్కువ వడ్డీతో ఉన్న రుణాలను చెల్లించేందుకు వీలుగా తక్కువ వడ్డీతో రుణాలు తీసుకునే వీలు కల్పించాలని ప్రభుత్వం కోరుతోంది. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం వివిధ సంస్థల నుంచి సేకరించిన రుణాలు, వడ్డీల చెల్లింపులకు సరిపోతోంది. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వానికి దాదాపు 1.6 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు పేరుకుపోయినట్లు తేల్చారు. ఈ మొత్తం 2019-20 నాటికి 1.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను 1.35 లక్షల కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ బడ్జెట్‌లో 25,012 కోట్ల రూపాయల మేరకు అప్పుల ద్వారా వివిధ సంస్థల నుంచి సమీకరించాలని ప్రతిపాదించారు. రుణ చెల్లింపులకు 5,554 కోట్ల రూపాయలు, వడ్డీ చెల్లింపుల కోసం 12,258 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారు. ఆదాయంలో దాదాపు 15 శాతం రుణాలు, వడ్డీల చెల్లింపులకు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధుల కేటాయింపులను 32 నుంచి 42 శాతానికి పెంచుతూ, కొన్ని పథకాలను కుదించింది. దీంతో కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు పొందే అవకాశాలు తగ్గుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెద్దనోట్ల రద్దు, తదితర పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌లో తక్కువ వడ్డీకి రుణాలు లభించే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునే రుణాలపై దాదాపు 10 శాతం వరకూ వడ్డీ ఉంటుండగా ఆర్‌బిఐ, తదితర సంస్థల నుంచి 8 నుంచి 9 శాతం వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ రుణాలకు సగటున 7.78 శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. 60 శాతం మేరకు రుణాలను ఆర్‌బిఐ నుంచి, 7.5 శాతం కేంద్రం నుంచీ సమకూర్చుకుంటోంది. మార్కెట్‌లో ఏడు శాతం వడ్డీకే రుణాలు లభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న రుణాలను చెల్లించి, తక్కువ వడ్డీకి లభించే కొత్త రుణాలను తీసుకునే అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బహిరంగ మార్కెట్‌లో రుణాలు పొందేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌ఎంబి పరిమితిని నాలుగు శాతానికి పెంచాలని ఇప్పటికే కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. సాధారణంగా జిఎస్‌డిపిలో రుణ మొత్తం 25 శాతం, వడ్డీ 10 శాతానికి మించకూడదు. వివిధ ప్రాజెక్టులకు విదేశీ రుణాల వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో నిర్మించనున్న మెట్రోరైలు ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, తదితర ప్రాజెక్టులకు విదేశీ రుణాల వైపు దృష్టి సారించింది. సాధారణంగా విదేశీ రుణాలు కొన్ని పరిమితులకు లోబడి నాలుగు శాతం వడ్డీకే ఇచ్చేందుకు ఆయా సంస్థలు ముందుకొస్తుంటాయి. దీంతో కొన్ని ప్రాజెక్టులకు విదేశీ రుణాలు పొందటం ద్వారా ఆర్థిక భారాన్ని కొంతమేరకు తగ్గించుకునే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.