ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 23: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు వేలంలో ప్రభుత్వమే ఆయా ఆస్తులను కొనుగోలు చేసి పరిహార పంపిణీ చర్యలను వేగవంతం చేసేలా రాష్ట్ర గవర్నర్ సిఎల్‌ఎన్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని ఎపిసిసి నేతలు కోరారు. ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి నేతృత్వంలో మండలి విపక్ష నేత సి రామచంద్రయ్య, మాజీ మంత్రి శైలజానాధ్, ఎపిసిసి లీగల్ సెల్ ఛైర్మన్ సుందరరామశర్మ, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్, ఎపిసిసి ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, ఎం సూర్యానాయక్ తదితరులు గురువారం రాష్ట్ర గవర్నర్ సిఎల్‌ఎన్ నరసింహన్‌కు ఆయా అంశాలపై వేర్వేరుగా వినతి పత్రాలను అందించారు.
భూ సేకరణ నిలిపివేయాలి
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామ పరిధిలోని 6 పల్లెల్లో అమ్మవారుపల్లి, దుద్దేబండ, వెంకటగిరిపాలెం, మక్కాజిపల్లి, తాండా,గుట్టూరు, కురుబవాండ్లపల్లి గ్రామాల పరిధిలో పారిశ్రామిక వాడ అభివృద్ధికి గాను ప్రభుత్వ చేపట్టనున్న భూ సమీకరణ, సేకరణ చర్యలు అడ్డుకోవాలని ఎపిసిసి నేతలు కోరారు. గొల్లపల్లి రిజర్వాయర్ ఒక కిలోమీటర్ సమీపంలో ఉన్నందున నీరు పుష్కలంగా లభించి ఏడాదిలో రెండు పంటలను పంపిస్తున్న విషయం గమనార్హమన్నారు.