ఆంధ్రప్రదేశ్‌

పాఠ్యపుస్తకాల ముద్రణ టెండర్ల ప్రక్రియలో తెలంగాణ ప్రింటర్స్‌ను అనుమతించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణకు సంబంధించి టెండర్ల ప్రక్రియలో తెలంగాణ వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కూడా పాల్గొనేందుకు అనుమతించాలని హైకోర్టు గురువారం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు డి వినోద్‌కుమార్ తరఫున న్యాయవాది లంచ్ మోషన్‌ను గురువారం ప్రస్తావించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది దీపక్ భట్టాచార్యజీ వాదనలు వినిపిస్తూ ఏపి ప్రభుత్వం పుస్తకాల ముద్రణపై ఫిబ్రవరి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఏపికి చెందిన ప్రింటర్లకు మాత్రమే అర్హత ఉంటుందని నిబంధనల్లో చేర్చించిందన్నారు.
ఈ సందర్భంగా ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పుస్తకాల ముద్రణలో జాప్యం నివారించేందుకు ఆంధ్రాకు చెందిన ప్రింటర్లకే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం హైకోర్టు తెలంగాణ ప్రింటర్లు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.