ఆంధ్రప్రదేశ్‌

ఫసల్ బీమా యోజనతో రైతుల రాత మారేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 14: దేశానికి వెనె్నముక అయిన అన్నదాతకు కష్టాలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిన ప్రస్తుత తరుణంలో రైతన్న తట్టుకుని నిలబడడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా రాయలసీమలాంటి వరుస కరవుప్రాంతాల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతుల కోసం ప్రవేశపెట్టిన పలు బీమా పథకాలు ఏ మాత్రం ధీమా ఇవ్వని పరిస్థితి నెలకొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘్ఫసల్ బీమా యోజన’తో అయినా అన్నదాతల బతుకు బాగుపడుతుందా అనే ఆశలు చిగురిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రైతుల కోసం బీమా పథకాలను స్వాతంత్య్రానికి మునుపే ప్రవేశపెట్టారు. అయినప్పటికీ అప్పటి నుంచీ ఇప్పటివరకూ రైతుల తలరాత మారలేదు సరికదా మరింతగా సంక్షోభంలోకి కూరుకుని పోతూనే ఉన్నాడు. దేశవ్యాప్తంగా చూసినపుడు స్వాతంత్య్రానికి పూర్వమే పంటల బీమా పథకం అమలులో ఉంది. మైసూరు రాష్ట్రంలో 1915లో మొదటగా పంటల బీమా పథకం అమలు చేసినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కొన్ని ప్రాంతాల్లో అమలులోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలోఅమలు చేసిన దాఖలాలు లేవు. అనంతరం 1972లో ఫస్ట్ ఎవర్డ్ క్రాప్ బీమా పథకం అమలులోకి వచ్చింది. దీనిని స్వాతంత్య్రం వచ్చాక అమలులోకి వచ్చిన మొదటి పంటల బీమాగా చెప్పుకోవచ్చు. పత్తి, వేరుశెనగ, గోధుమ, తదితర పంటలకు దీనిని వర్తింప చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండగా 1978 వరకూ ఈ పథకాన్ని అమలు చేశారు. దీనివల్ల కూడా రైతులకు ఏ మాత్రం లాభం చేకూరలేదని భావించి, 1979లో పైలెట్ క్రాప్ ఇన్య్సూరెన్సు స్కీమ్ అన్న బీమా పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. అప్పట్లో ప్రొఫెసర్ దండేకర్ ఈ బీమా పథకాన్ని రూపొందించగా దీనిద్వారా దేశంలోఅత్యధికంగా 6.27 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అయితే ఇది కూడా పూర్తి సంతృప్తికరంగా లేకపోవడంతో మళ్లీ ఈ పథకంలోమార్పులు తీసుకుని వస్తూ 1985లో కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్య్సూరెన్సు ను ప్రవేశపెట్టారు. దీనిని దేశంలోని 15 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేశారు. అప్పట్లో దీని ద్వారా 7.63 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరగా ఇది అమలు జరుగుతున్న సమయంలోనే ఎక్స్‌పెరిమెంటల్ క్రాప్ ఇన్య్సూరెన్సు పథకాన్ని 1997లో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. దీనిని ఐదు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఆగిపోయింది. 2000 సంవత్సరంలో పైలెట్ స్కీమ్ ఆన్ సీడ్ క్రాప్ ఇన్య్సూరెన్సు పథకాన్ని ప్రవేశపెట్టగా దీనిద్వారా రైతులకు నాణ్యమైన విత్తనం ఇచ్చి పంటల బీమాను అమలు చేశారు. అనంతరం ఫామ్ ఇన్‌కమ్ ఇన్య్సూరెన్సు స్కీమ్‌ను 2003లోప్రారంభించారు. ఇదే సమయంలో నేషనల్ అగ్రికల్చర్ ఇన్య్సూరెన్సు స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ పథకాలేవీ రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అనే కొత్త విధానాన్ని తీసుకుని వచ్చింది. దీనిద్వారా అయినా రైతుల బతుకుల్లో వెలుగులు నిండుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి.