ఆంధ్రప్రదేశ్‌

ఆ దేవాలయాల వర్గీకరణ సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: గుంటూరు జిల్లాలో రెండు దేవాలయాలను, ఇతర ఆరు దేవాలయాలతో కలిపి ఒక గ్రూపుగా వర్గీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన కేసు గత రెండు దశాబ్ధాలకు పైగా హైకోర్టులో నడుస్తోంది. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలోని శ్రీ సంగమేశ్వర దేవాలయం, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాలను, అదే జిల్లాలో ఇతర ఆరు దేవాలయాలతో కలుపుతూ ఒక గ్రూపుగా వర్గీకరిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసి ఒక కార్యనిర్వహణాధికారిని నియమించడం చెల్లదని హైకోర్టు పేర్కొంది. వివరాల్లోకి వెళితే మొత్తం ఎనిమిది దేవాలయాల్లో నాలుగు దేవాలయాలు వంశపారంపర్య ట్రస్టు పరిధిలో ఉన్నాయని, మిగిలిన నాలుగు దేవాలయాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిధిలో ఉన్నాయని దేవాదాయ కమిషనర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 1994 నవంబర్ 15వ తేదీన ఏపి ప్రభుత్వం ఎనిమిది దేవాలయాలను ఒక గ్రూపుగా ప్రకటించింది. తాను ఎనిమిది దేవాలయాలకు వంశపారంపర్య ట్రస్టీనంటూ ఎంఎస్‌విఎం రావు అనే వ్యక్తి దేవాదాయ శాఖకు వినతిపత్రం ఇచ్చారు. తన పూర్వీకులు రాచూరు జమీందార్లని, ఈ దేవాలయాలకు భూములను విరాళంగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎనిమిది దేవాలయాలను దేవాదాయ శాఖ కలిపేసింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ త్రిపురనేని జ్యోత్స్నశ్రీ అనే మహిళ దేవాదాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సంగమేశ్వర దేవాలయం, శ్రీవేణుగోపాల స్వామి దేవాలయాలను, ఇతర ఆరు దేవాలయాలతో విలీనం చేయరాదని కోరారు. ఈ వినతిపత్రం ఆధారంగా 1996 అక్టోబర్ 9వ తేదీన దేవాదాయ శాఖ , రెండు దేవాలయాలను, మిగిలిన ఆరు దేవాలయాల నుంచి వేరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ నిర్ణయాన్ని ఎంఎస్‌విఎం రావు సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది దేవాలయాలను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పైగా ఎంఎస్‌విఎం రావును ఈ దేవాలయాల సమూహానికి వ్యవస్ధాపక ట్రస్టీగా నియమించింది.
అనంతరం త్రిపురనేని జ్యోత్స్నశ్రీ హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సంగం జాగర్లమూడి లోని రెండు దేవాలయాల అభివృద్ధికి, పూజ, నిత్యసేవలకు తమ కుటుంబాలు అంకితమై ఉన్నాయని, ఎంఎస్‌విఎం రావుకు శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంతో సంబంధం లేదని పేర్కొన్నారు. కాని సంగమేశ్వర దేవాలయం వ్యవస్ధాపకుల్లో ఒకరు ఎంఎస్‌విఎం రావు పూర్వీకులు ఉన్నారని తెలిపారు. ఈ వ్యవస్ధాపకుల్లో తమ పూర్వీకులు కూడా ఉన్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. ఈ పిటిషన్‌కు సంబంధించి ఇరు వర్గాల వాదనలు, ప్రభుత్వ వాదనలు విచారించారు. ఏపి దేవాదాయ చారిటబుల్ ట్రస్టు చట్టం కింద దేవాలయాలను ఒకే గ్రూపుగా వర్గీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ చట్టానికి చేసిన సవరణ 2008 జనవరి 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని, ఈ చట్టం వల్ల కమిషనర్‌కు దేవాలయాలను ఒకేగ్రూపు పరిధిలోకి తీసుకువచ్చే అధికారం ఉందన్నారు. కాని అంతకు ముందు ఈ దేవాలయాలను ఒక గ్రూపుగా వర్గీకరించే అధికారం దేవాదాయశాఖ కమిషనర్‌కు లేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఎంఎస్‌విఎం రావును వ్యవస్ధాపక ట్రస్టీగా ప్రభుత్వం గుర్తించడాన్ని కొట్టివేస్తూ, ఈ కేసులో పిటిషనర్‌కు ఎంఎస్‌విఎం రావు ఐదు వేల రూపాయలను కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.