ఆంధ్రప్రదేశ్‌

రాముడు.. ఆదర్శప్రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: సర్వమానవాళికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు అందరికీ ఆయన శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎపి అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌బాబు, సినీనటుడు ఎన్ బాలకృష్ణ తదితరులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి పాలన సర్వతోముఖ వికాసానికి, అందరి శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని అన్నారు. కష్టాలలో మనోనిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి శ్రీరాముడు విజయం సాధించారని ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నూతన ఉత్సాహంతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శ్రీరామ నవమి పండుగ ప్రజలవు అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.