ఆంధ్రప్రదేశ్‌

అసమానతలు పోగొట్టిన అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: అస్పృశ్యత మూలాలను ప్రశ్నించి, అసమానతల పునాదులను పెకిలించి అపూర్వ సందేశాలను భరతజాతికి అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని ఎబివిపి అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి గుంతా లక్ష్మణ్ పేర్కొన్నారు. అఖిల భాతర విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 కాగడాలతో ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శన చేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఒక జాతిని గాని, నీతిని గాని కులం పునాదులపై నిర్మించలేమని అంబేద్కర్ అన్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. నిక్కమైన ప్రజాస్వామ్య విలువలకు పోరాడారని నిర్భీతిగా తన భావాలను విశ్వమంతా ప్రకటించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. నిజమైన స్వాతంత్య్రానికి నిరంతరం శ్రమించి, నిరుపేదల స్వేచ్ఛ కోసం అనుక్షణం తపించారని అన్నారు. పేద ప్రజలకు, బడుగు బలహీనవర్గాల ప్రజలను అందరితో సమానంగా నిలిపారని, భారతీయులు అంతా స్వేచ్ఛా సమత, బంధుభావంతో మెలగాలని సూచించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి కార్యదర్శి అయ్యప్ప, సంయుక్తకార్యదర్శి వేణు, విభాగ్ సంఘటన కార్యదర్శి నిరంజన్, యాదగిరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు రాఘవేందర్, దిలీప్, విద్యార్ధి నాయకులు శ్రీహరి, బ్రహ్మచారి, వెంకటరెడ్డి, శ్రావణ్, రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, శ్రీరామ్ తదతరులు పాల్గొన్నారు.