ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌టిఓ ఇంట్లో ఏసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 3: పశ్చిమగోదావరి జిల్లాలో మెగా లంచావతారం ఎసిబి అధికారుల చేతికి చిక్కింది. కృష్ణాజిల్లా గన్నవరం సబ్-ట్రెజరీ అధికారిగా పనిచేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నివాసం ఉంటున్న గడ్డం విజయగణేష్‌బాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగివురనే అభియోగంతో జరిపిన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. కోట్లకు పడగలెత్తిన ఎస్‌టిఓ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు చూసి ఎసిబి అధికారులు కూడా విస్తుపోయారు. కనీసం ప్లాస్టరింగ్ కూడా లేకుండా, ఎటువంటి హంగులు లేని చిన్న చిన్న గదుల్లో కోట్లకు పడగలెత్తిన ఈ శ్రీమంతుడు నివాసం ఉంటున్నాడా అని ఆశ్చర్యపోయారు. ఏలూరు ఎసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ యుజె విల్సన్‌తోపాటు రాజమండ్రి డిఎస్పీ ఎం సుధాకరరావు, ఇన్‌స్పెక్టర్ సూర్యమోహన్ ఇతర సిబ్బంది బృందాలుగా ఏర్పడి గన్నవరం సబ్-ట్రెజరీ కార్యాలయం, ఏలూరులోని ఆయన నివాసం, ఆయన స్నేహితుడు జంగారెడ్డిగూడెం ఎస్‌టిఓ బసవరాజు ఇల్లు, తాడేపల్లిగూడెంలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో ఆయనకు దాదాపు 19 రకాల ఆస్తులున్నట్లు దస్తావేజులు బయటపడ్డాయి. అంతేకాకుండా పెద్దఎత్తున వడ్డీవ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు నిదర్శనంగా 78 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 26 బయట వ్యక్తుల చెక్కులు బయటపడ్డాయి. ఆయన పిల్లల గురించి ఆరా తీస్తే ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉండగా వారిద్దరు విదేశాల్లో పేమెంట్ సీట్లపై వైద్య విద్య చదువుతున్నట్లు తేలింది. దీంతోపాటు ఆయన ఇంట్లో ఏకంగా 25 దేశీయ, విదేశీ ఖరీదైన మద్యం బ్రాండ్ల ఫుల్‌బాటిల్స్ బయటపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా పూళ్లకు చెందిన గణేష్‌బాబు 1993లో జూనియర్ అక్కౌంటెంట్‌గా ట్రెజరీ శాఖలో చేరారు. అనంతరం సీనియర్ అక్కౌంటెంట్‌గా పదోన్నతి పొంది ఏలూరు, నర్సాపురంలో పనిచేశారు. ఆ తర్వాత ఎస్‌టిఓగా పదోన్నతి పొంది ఏలూరులో పనిచేసి, ఏడాదిన్నర క్రితం గన్నవరం బదిలీ అయ్యారు. ఆయనకు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉండగా వీటివిలువే కోట్లలో ఉంటుందని అంచనా స్తున్నారు. మహారాష్టల్రోని నాంధేడ్‌లో కూడా కుమారుని పేరుమీద విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. వీటివిలువ అధికారికంగా కోటి 20లక్షల రూపాయలు అని అధికారులు పేర్కొంటుండగా బహిరంగమార్కెట్‌లో వీటివిలువ దాదాపు రూ.15కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని అంచనా. ఏలూరులోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో గణేష్‌బాబుకు ఉన్న లాకర్‌లో 350 గ్రాముల బంగారం, కేజి వెండి వస్తువులు గుర్తించారు. కాగా అధికారుల తనిఖీలు శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు కూడా కొనసాగాయి.