ఆంధ్రప్రదేశ్‌

స్విమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ రవికుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 16: స్విమ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తూ సెలవుపై వెళ్లిన డాక్టర్ టి ఎస్ రవికుమార్‌ను పూర్తిస్థాయిలో డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ జిఓ జారీచేసిన నేపథ్యంలో ఆయన శనివా రం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ శివకుమార్ నుంచి రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ను టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ వి ఎస్ ఆర్ ఆంజనేయులు, ఇతర సిబ్బం ది అభినందించారు. కాగా స్విమ్స్ డైరెక్టర్‌గా, యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా డాక్టర్ టి ఎస్ రవికుమార్ కొనసాగనున్నారు.