ఆంధ్రప్రదేశ్‌

12 అడుగుల నల్లతాచును చంపిన మాడుగుల గ్రామస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, ఏప్రిల్ 16: విశాఖపట్నం జిల్లా మాడుగుల గ్రామంలో 12 అడుగుల నల్లతాచును స్థానికులు హతమార్చారు. గ్రామంలోని రెల్లివీధిలో ఉంటున్న బొమ్మాల అప్పలరాజు ఇంటిలోకి శనివారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో నల్ల తాచుపాము ప్రవేశించింది. పామును గమనించిన అదే కాలనీకి చెందిన ధనేష్, రామకృష్ణ గట్టిగా కేకలు వేశారు. దీంతో వీధిలోని జనం లేచి పామును పట్టుకునే పనిలో పడ్డారు. ఆఖరికి తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో పామును పట్టుకుని చంపి కాల్చివేశారు. అర్ధరాత్రి పూట 12 అడుగుల నల్లతాచు ఇంట్లోకి ప్రవేశించడంతో జనం భయాందోళనకు గురయ్యారు.