ఆంధ్రప్రదేశ్‌

అమృత్ పట్టణ ప్రాజెక్టుల పథకానికి కన్సల్టెంట్ల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ పట్టణాల అభివృద్ధి పథకానికి రూపకల్పన చేసేందుకు గాను మూడు కన్సల్టెన్సీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కన్సల్టెన్సీలను ప్రభుత్వ అపెక్స్ కమిటీ ఖరారు చేసింది. అమృత్ పట్టణాల రీజియన్ -1కు ఎఇకామ్ ఏషియా కంపెనీ లిమిటెడ్, రీజియన్-2కి టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ల ఫైనాన్సియల్ బిడ్లను పరిశీలించిన అనంతరం ఈ రెండు కంపెనీలను ఖరారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర పథకాల అమల్లో ఆర్థిక వ్యవహారాల సమీక్షకు కమిటీ
కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు గాను రాష్ట్ర స్థాయి ఫైనాన్సియల్ ఇన్‌క్లూజియన్ కమిటీని నియమిస్తూ ఎపి ప్రభుత్వం జివో జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, సభ్య కన్వీనర్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి, సభ్యులుగా ఐటిశాఖ కార్యదర్శి, యుఐడిఏఐ డిప్యూటీ డైరక్టర్ జనరల్, ఆర్‌బిఐ జిఎం, పౌరసరఫరాల శాఖ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళాసాధికార సంస్థ సిఈఓ, ఎన్‌పిసిఐ సలహాదారు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, కేంద్ర డిఎఫ్‌ఎస్ నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించింది.