ఆంధ్రప్రదేశ్‌

విద్యాసంస్థలకు భూముల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్‌లో పలు విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం విడివిడిగా జివోలు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం తడకల్ల వద్ద 172.08 ఎకరాలను ఎన్‌ఐటికి ఏర్పాటు కేటాయించింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఐఐఎం ఏర్పాటుకు 241.50 ఎకరాలను, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరులో 491.23 ఎకరాలను కేంద్ర విశ్వవిద్యాలయానికి, కడప జిల్లా పుట్టంపల్లి వద్ద 10.15 ఎకరాలను వౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి, అనంతపురం జిల్లా సోమనాథపల్లి వద్ద 409.53 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కుకు, కర్నూలు జిల్లా బనవాసి గ్రామంలో టెక్స్‌టైల్ పార్కుకు 91.31 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సంస్థల అధిపతులకు ఈ భూమిని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.