ఆంధ్రప్రదేశ్‌

జనసేన ‘జనగళం’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 13: ప్రజా సమస్యలపై జనసేన స్పందించనుంది. రాజకీయ పార్టీగా అవతరించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక జనంలోకి వెళ్లాలన్న అభిప్రాయంతో అధినేత పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగానే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు రావాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించి ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నట్టు అంతరంగికులు పేర్కొంటున్నారు. ‘జనగళం’ పేరిట ఏర్పాటు చేసే పోర్టల్‌లో ఆయా ప్రాంతాలకు చెందిన సమస్యలు ప్రస్తావిస్తే దానిపై జన‘సేన’ స్పందించే విధంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న జనసేన హోదా సాధనతో పాటు ప్రాంతాల వారీగా స్థానిక సమస్యలపై స్పందించడం ద్వారా నేరుగా జనాల్లోకి వెళ్లాలన్న యోచన చేస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి, బిజెపికి అనుకూలంగా ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనను ఇటీవల బయటపెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఇక రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో జనసేనను ప్రజల్లోకి తీసుకుకెళ్లే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం ద్వారా తాము విపక్ష పాత్ర పోషిస్తున్నామన్న సంకేతాలివ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం ఉద్దానంలో కిడ్నీ బాధితుల పరామర్శ, వారికి భరోసా ఇవ్వడం ద్వారా మంచి మైలేజ్ సాధించారు. అలాగే ప్రాంతాల వారీగా ఆయా సమస్యలపై అధినేత పవన్ నేరుగా ఉద్యమంలోకి దిగడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే, ఇక మనకు తిరుగు ఉండదని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. జనసేన జనగళం ద్వారా తొలి ప్రయత్నంగా నేడు(14వ తేదీ) ఆయా జిల్లాల్లో స్థానిక అవసరాలు, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాన్ని చేపట్టనుంది. తద్వారా ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, భవిష్యత్‌లో తాము రాజకీయంగా తెరపైకి రావడమే కాకుండా, బలమైన ప్రత్యర్థిగా నిలుస్తామన్న సంకేతాలివ్వనున్నారు.