ఆంధ్రప్రదేశ్‌

రాంమాధవ్ మాయాజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 13: తాజాగా జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్‌లో బిజెపికి మెజారిటీ లేకపోయినా కమల వికాసం ఖాయయింది. ప్రధాని మోదీ బృందసభ్యుడు, తెలుగు నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చూపిన చాణక్యం అక్కడ బిజెపి సర్కారును ఏర్పాటుచేయనుంది. నిజానికి అక్కడ బిజెపి 21, కాంగ్రెస్ 28, ఇతరులు 10, టీఎంసి ఒక సీటు గెలుచుకున్నాయి. ఫలితంగా మణిపూర్ కాంగ్రెస్ ఖాతాలో కలుస్తుందని చాలామంది భావించారు. అయితే, అక్కడ బిజెపి ఇన్చార్జిగా ఉన్న రాంమాధవ్ రాత్రికి రాత్రి చక్రం తిప్పి, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో పదిమంది స్వతంత్ర ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లి పెరేడ్ చేయించి చాణక్యం ప్రదర్శించారు. దీనితో కంగుతిన్న ప్రస్తుత సీఎం ఇబోబిసింగ్.. గవర్నర్ వద్దకు తన వద్ద ఉన్న 27మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే ప్రయత్నం నెరవేరకపోవడంతో, వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయినా రాంమాధవ్ తమ వద్ద ఉన్న 32 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ నజ్మాహెప్తుల్లా ఎదుట ప్రదర్శించడం ద్వారా మణిపూర్‌లో కమల వికాసానికి కారణమయ్యారు. గతంలో జమ్ము, కాశ్మీర్, ఆ తర్వాత సంభ్రమాశ్చర్యం కలిగించిన అసోం విజయాల్లో కూడా రాంమాధవ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.