ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీ కార్యాలయాల్లో మోగని ‘కంచు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: రాష్ట్రంలోని జిల్లా, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో బ్రిటీష్‌కాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న కంచుగంటలను ఏం చేస్తారనే అంశం ప్రస్తుతం ప్రతి కార్యాలయంలోనూ చర్చనీయాంశంగా మారింది. కాలగమనంలో ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోవడంతో ప్రస్తుతం ఆ గంటలు దిష్టిబొమ్మలుగా మారాయి. ప్రస్తుతం అసలు ఈ గంటలతో పనిలేకపోవటంతో వాటిని కాపాడలేక అనేక కార్యాలయాల్లో వాటిని జాగ్రత్తగా పదిలపరచారు. పలు ప్రాంతాల్లో దిష్టిబొమ్మల్లా వేలాడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 13 జిల్లా ట్రెజరీలు, వాటికి అనుబంధంగా ప్రతి జిల్లాలో 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలున్నాయి. వీటిల్లో అత్యధికం పోలీస్‌స్టేషన్ ప్రాంగణాల్లో ఉన్నాయి. గతంలో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో ట్రెజరీలు ముఖ్యపాత్ర వహిస్తూ వచ్చాయి. అప్పుడు ప్రతి సబ్ ట్రెజరీ కార్యాలయానికి కూడా పోలీస్ బందోబస్తు ఉండేది. మూడు షిఫ్టుల్లో షిఫ్టుకు ఇద్దరేసి కానిస్టేబుల్స్ ఉండేవారు. స్టాంపుల కుంభకోణంలో తెల్గీ, మంత్రి కృష్ణయాదవ్ పట్టుబడేవరకు కోట్లాది రూపాయల విలువైన స్టాంపులు జిల్లా, సబ్ ట్రెజరీల్లో నిలువ ఉండేవి. అలాగే ప్రశ్నాపత్రాలు. కోట్లాది రూపాయల నగదు కూడా నిలువ ఉండేవి. కాలగమనంలో తొలుత స్టాంపుల నిల్వలు లేకుండా పోయాయి. రెండేళ్లుగా ట్రెజరీల ద్వారా చెల్లింపులు నిలిచాయి. నెట్ బ్యాంకింగ్ విధానంతో అన్ని రకాల బిల్లులు ట్రెజరీల నుంచి బ్యాంక్‌లకు చేరిన వెంటనే నేరుగా అక్కడి నుంచి సంబంధిత ఖాతాలకు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇక ప్రశ్నాపత్రాలు పోలీస్‌స్టేషన్లలో భద్రపరుస్తున్నారు. అయినప్పటికీ పోలీస్ భద్రతా వ్యవస్థ మాత్రం కొనసాగుతున్నది. వాస్తవానికి రాత్రివేళ ఒక వాచ్‌మెన్ చాలు.. అయినా పర్యవేక్షించే నాథుడు లేకపోవటమే దానికి కారణం. ఈ బందోబస్తు నిమిత్తం ప్రతి నెలా కనీసం రూ.3 లక్షలు చొప్పున సాలీనా రూ.40 లక్షలు వరకు వెచ్చించాల్సి వస్తున్నది. గతంలో 8 గంటల షిఫ్టు పూర్తికావటంతోనే దానికి గుర్తుగా గంట కొట్టేవారు. ప్రస్తుతం ఆ విధానమే అమల్లో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 234 కంచుగంటలు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో గంట బరువు 35 కిలోలు వరకు ఉంటే కంచు కిలో ధర రూ.1200ల వరకు ఉంది. ఈమేర ఒక్కో గంట విలువ దాదాపు రూ.50వేలు వరకు ఉంటే రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఈ గంటల విలువ మూడు కోట్లు వరకు ఉంది. వీటిని విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమచేయటం లేదా శిథిలావస్థలోఉన్న కార్యాలయాలకు మరమ్మతులు చేయటమా లేక జ్ఞాపకంగా మ్యూజియంలో భద్రపరచటమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కోర్టుల్లో వివిధ కేసులకు సంబంధించి కొద్దిపాటి బంగారు ఆభరణాలనే అదీ కొన్ని ట్రెజరీల్లో భద్రపరుస్తున్నారు. అంతకు మించి వీటి ప్రాధాన్యత లేదనే చెప్పాలి. తాజాగా ఆర్థిక నేరాలు జరుగుతుండటంపై ఇటీవల ఆంధ్రభూమి దినపత్రికలో వార్తా కథనాలు వెలువడిన విషయం విదితమే.

చిత్రం..ట్రెజరీల్లో నిరుపయోగంగా ఉన్న కంచు గంటలు